అంబానీ ఇంటిఎదుట బాంబు కేసులో కీలక మలుపు

Fri Jun 18 2021 08:00:01 GMT+0530 (IST)

twist in the case of the bomb blasts in front of Ambani house

దేశంలోనే నంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో కలకలం రేపిన కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే పేరు వినపడింది. ఇప్పుడు ఆయన గురువు మరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ప్రదీప్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది.అంబానీ ఇంటి ఎదుట బాంబు పేలుళ్ల కేసులో తాజాగా ఎన్ఐఏ అధికారులు ప్రదీప్ శర్మను అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారుజామునే ప్రదీప్ శర్మ ఇంటి ఎదుట ఎన్ఐఏ సీఆర్పీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 6 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రదీప్ శర్మను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు.

1983లో పోలీస్ ఉద్యోగాన్ని ప్రదీప్ శర్మ ప్రారంభించారు. నిఘా సమాచారం సేకరించడంలో దిట్ట. క్రైం బ్యాంచ్ లో ఎక్కువ పనిచేశారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపొందాడు. సచిన్ వాజే పనిచేసిన బృందానికి ప్రదీప్ శర్మనే నాయకత్వం వహించడంతో ఈయనపై ఎన్ఐఏకు అనుమానాలు కలుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్ఐఏ సోదాలు అదుపులో తీసుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరింది.