Begin typing your search above and press return to search.
కన్నడ టీవీ నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్
By: Tupaki Desk | 19 Oct 2021 10:00 AM ISTకన్నడనాట నటి సౌజన్య మరణం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమెది హత్యనా? ఆత్మహత్యనా? అన్నది తేలాల్సి ఉంది. గతనెల 30న నటి సౌజన్య అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్ ను విచారించారు.
అయితే నటి సౌజన్య పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది ఆత్మహత్య అని తేలింది. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కన్నడ టీవీ సీరియల్ నటి సౌజన్య బెంగళూరు సమీపంలోని అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. సౌజన్య కొడగు జిల్లాలోని కుశల్ నగర్ నివాసి. అనేక సీరియల్స్, కొన్ని కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఆమె పాదాలపై టాటూల ద్వారా పోలీసులు ఆమెను గుర్తించారు.
ఇక నటి సౌజన్య మరణించిన గదిలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. సూసైడ్ నోట్ ఇంగ్లీష్, కన్నడలో రాసినట్లు పోలీసులు కనుగొన్నారు. తనది హత్య అన్న కోణంలో ఆమె తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపారు. ఇక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నటి సౌజన్య తన సూసైడ్ నోట్ లో వెల్లడించింది.
నటి సౌజన్య ఆరోగ్యం క్షీణించడం.. పరిశ్రమలో అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు నోట్ లో వెల్లడించింది. ఆత్మహత్య చేసుకోవడంపై నటి సౌజన్య తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పింది. డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు.
సౌజన్య డెత్ నోట్ లో 27,28,30 తేదీల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని తెలిపింది. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడం.. చేసేందుకు పని లేకపోవడం వల్ల కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది.