Begin typing your search above and press return to search.
టీవీ కొనే ప్లానింగ్ ఉందా? అర్జెంట్ గా కొనేయండి.. ఆలస్యం చేస్తే భారమే
By: Tupaki Desk | 12 March 2021 10:00 AM ISTత్వరలో కొత్త టీవీ కొనే ప్లాన్ లో ఉన్నారా? ఆలస్యం చేయొద్దు. అర్జెంట్ గా కొనేయండి. ఏ మాత్రం లేట్ చేసినా.. క్యాలెండర్ లో ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. టీవీ ధరలు పెరగటం ఖాయమని చెబుతున్నాయి వ్యాపార వర్గాలు. ఎల్ ఈడీ టీవీల ధరలు మరింత పెరగనున్నాయి. దీనికి కారణం ఓపెన్ సెల్ ప్యానెళ్ల ఖరీదు పెరగటమేనని చెప్పాలి. గడిచిన నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం ఎక్కువైనట్లు చెబుతున్నారు.
దీంతో.. ఏప్రిల్ నుంచి టీవీ ధరల్ని పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరకు కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్ఠంగా ఏడుశాతం వరకు ధర పెరిగే వీలుందని చెబుతున్నారు. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడి భాగమని.. మొత్తం టీవీ ధరలో 60 శాతం దీనిదే ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. పెరిగే ధరా భారం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక.. ఓపెన్ సెల్ ప్యానెళ్ల మార్కెట్ ను శాసిస్తోంది చైనా మార్కెట్లే కావటం గమనార్హం. హోం అప్లయెన్సెస్.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో టీవీలతే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం 1.7 కోట్ల టీవీలు అమ్మడవుతుంటే.. వీటి విలువ రూ.25వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్ల కొరత ఉందని.. గడిచిన మూడు నెలల వ్యవధిలో వీటి ధర మూడింతలు పెరిగినట్లుగా చెబుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ పెరిగే ధరల భారం ఏ రేంజ్ లో ఉంటుందన్న సందేహంలో ఉన్నారా? అక్కడికే వస్తున్నాం. టీవీ అమ్మకాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీ ధర తక్కువలో తక్కువ రూ.5-6 వేల వరకు పెరిగే వీలుందని చెబుతున్నారు. ఈ లెక్కన 55-65 అంగుళాల టీవీ ధర భారం భారీగా ఉండనుందన్న మాట. అర్థమైందిగా.. టీవీ కొనే ప్లానింగ్ ఉంటే.. ఎంత త్వరగా కొనాలో అర్థమైందిగా?