Begin typing your search above and press return to search.

ఆ టీవీ నటిని ఎంత దారుణంగా చంపారంటే..

By:  Tupaki Desk   |   5 Dec 2016 9:50 AM GMT
ఆ టీవీ నటిని ఎంత దారుణంగా చంపారంటే..
X
గ్లామర్ రంగానికి చెందిన మహిళలు ఈ మధ్యన అనుమానాస్పద రీతిలో మరణించటం పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. టీవీ నటి.. మోడల్ 49 సంవత్సరాల డి.జయశీలి దారుణంగా హత్యకు గురి కావటం సంచలనంగా మారింది. ఆదివారం ఆమె ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో ఇరుగుపొరుగు వారికి సందేహంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చి.. ఇంట్లోకి వెళ్లగా.. ఆమె నగ్నంగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమె మృతదేహం పాక్షికంగా కుళ్లిపోవటాన్ని గుర్తించారు. ఆమె ఒంటిమీద ఉన్న ఇమిటేటెడ్ జ్యూయలరీని వదిలేసి.. 50 సవర్ల బంగారాన్నిదోచుకెళ్లిన వైనం చూసిన పోలీసులు.. ఇదంతా బాగా తెలిసిన వారి పనిగా భావిస్తున్నారు. బెడ్రూంలో బెడ్ మీద నగ్నంగా ఆమె పడి ఉండటాన్నిచూసిన పోలీసులు.. తొలుత లైంగిక దాడి చేసిన తర్వాత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి.. చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలంలో పెర్ ఫ్యూమ్ చల్లిన వైనంతో పాటు.. వాడేసిన కండోమ్ లు పడి ఉండటం పలు సందేహాలకు అవకాశాన్ని కల్పిస్తోంది. లైంగిక దాడి అనంతరం దారుణంగా హత్య చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/