Begin typing your search above and press return to search.
మలుపులు తిరుగుతున్న హెటిరో వివాదం ?
By: Tupaki Desk | 13 Oct 2021 11:41 AM ISTమూడు రోజులుగా జరుగుతున్న సోదాల్లో భారీ ఎత్తున హెటిరో డ్రగ్స్ కు సంబంధించిన కోట్లాది రూపాయలు పట్టుబడటం వివాదాస్పదమవుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పట్టుబడిన డబ్బు మొత్తం రు. 550 కోట్లని ఐటీ అధికారులు ప్రకటించారు. ఇంకా వందల కోట్ల మనీకి లెక్కలు సరిగా లేవని కూడా వారు ప్రకటించారు. ఎలాగూ కంపెనీ యాజమాన్యం స్పందించదు కాబట్టి అప్పటివరకు ఈ ఊహాగానాలు చక్కర్లు కొడుతునే ఉంటాయి.
సరే పట్టుబడిన మొత్తం ఎంతనే విషయాన్ని పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం దీనికి రాజకీయ కోణాన్ని జోడించేశారు. పట్టుబడిన డబ్బంతా హెటిరో డ్రగ్స్ దే కాబట్టి సదరు కంపెనీ యాజమాన్యం పార్ధసారధి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టేశారు. టీడీపీ నేతల ప్రచారం ఎలాగుందంటే పట్టుబడిన డబ్బు జగన్ కు సంబంధించిందనే అర్ధం వచ్చేట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. పైగా పార్ధసారధి రెడ్డి టీటీడీ ట్రస్టు బోర్డులో సభ్యునిగా ఉండటాన్ని కూడా టీడీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది కాబట్టి ఈ విషయంలో దర్యాప్తు కోసం వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మాల సీతారామన్ జోక్యం చేసుకోవాలట. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లెక్కల్లో లేని డబ్బుకి ఎన్ఐఏ విచారణకు ఏమిటి సంబంధమో టీడీపీ నేతలకే తెలియాలి. సరే టీడీపీ నేతలవి ఎప్పుడూ మోకాలికి బోడిగుండుకు ముడేసే పద్దతి కాబట్టే వాళ్ళ డిమాండ్ ను ఎవరు సీరియస్ గా తీసుకోవటంలేదు.
వీళ్ళ డిమాండ్లు ఇలాగుంటే తెలంగాణా సోషల్ మీడియాలో మరోరకమైన ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే హెటిరో డ్రగ్స్ లో పట్టుబడిన భారీ డబ్బుకు టీఆర్ఎస్ లోని కీలక నేతలకు సంబంధం ఉందట. ఓ కీలక నేత భార్య తరపున బంధువులు హెటిరో డ్రగ్స్ లో కీలక స్ధానంలో ఉన్నారట. ఇపుడు పట్టుబడిన డబ్బంతా హెజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పంపిణీ కోసం సిద్ధం చేసిన డబ్బే అని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
హెటిరో డ్రగ్స్ కంపెనీకి సంబంధించిన డబ్బు పట్టుబడిందనటంలో సందేహంలేదు. అయితే గతంలో కూడా ఇతర కంపెనీల్లో భారీమొత్తాలు పట్టుబడటం వాటికి యాజమాన్యాలు లెక్కలు చూపటం అందరు చూసిందే. ఒకవేళ లెక్కలు చూపలేకపోతే పట్టుబడిన మొత్తానికి ఐటీ శాఖ ఫైన్ వేస్తుంది. దాన్ని కట్టేస్తారంతే కానీ కేసులు, విచారణలో కోర్టుకు హాజరవ్వటం, జైలుశిక్షలు పడటం మన దగ్గర చాలా అరుదనే చెప్పాలి. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీల దగ్గర వందల కోట్లలో లెక్కల్లో లేని డబ్బు పట్టుబడటం మామూలే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇపుడ ఇదీ అలాంటిదే అవుతుందంతే.