Begin typing your search above and press return to search.

అమెరికా భయపెడుతున్న టర్కీ ఆయుధం

By:  Tupaki Desk   |   13 July 2019 1:30 PM GMT
అమెరికా భయపెడుతున్న టర్కీ ఆయుధం
X
అమెరికా, టర్కీ మధ్య మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. ఇప్పటికే ఇరాక్ యుద్ధం విషయంలో టర్కీ భూభాగాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతించకుండా టర్కీ ఆంక్షలు కొనితెచ్చుకుంది. అప్పటి నుంచి సంబంధాలు దిగజారాయి. ఇక టర్కీ, అమెరికా సహా 9 దేశాలు కలిసి అత్యంత అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ఉన్నాయి. అయితే తాజాగా ఈ విమానాల తయారీలో భాగస్వామి అయ్యి రష్యాకు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400ను టర్కీ కొనడం.. తాజాగా దిగుమతి చేసుకోవడం అమెరికాకు ఆగ్రహం తెప్పించింది..

ఎఫ్-35 యుద్ధ విమానం.. రాడార్లకు చిక్కని అత్యంత అధునాతన అమెరికా కలల ప్రాజెక్టు. దీనికోసం ఇప్పటికే బిలయన్లను ఖర్చు చేసింది అమెరికా. అలాంటి ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండి టర్కీ ఇప్పుడు రష్యా నుంచి గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం వివాదాస్పమైంది. ఎఫ్35లను టర్కీ వినియోగిస్తే ఆ రక్షణ వ్యవస్థలను రష్యా తయారీ ఎస్-400లకు చిక్కుతాయి. ఈ పరిణామం అమెరికా ఎంతో కష్టపడి తయారు చేసిన ఎఫ్-35 రాడార్ వ్యవస్థ లీక్ కు కారణమవుతుంది. అందుకే ఇప్పుడు టర్కీ చేసిన పనిపై అమెరికా ఆగ్రహంగా ఉంది.

టర్కీపై తీవ్ర ఆంక్షలకు సిద్ధమైంది. 100 ఎఫ్35 విమానాలను టర్కీ ఆర్డర్ ఇవ్వగా దాన్ని పెండింగ్ లో పెట్టింది. రష్యా మాత్రం ఎస్-400 లను అమ్మి సొమ్ము చేసుకుంటుంది. టర్కీ సహా సౌదీ నుంచి కూడా కాంట్రాక్టులు రావడంతో హ్యాపీగా ఉంది. అమెరికా మాత్రం ఇలా గల్ఫ్ దేశాలు రష్యాకు దగ్గరవ్వడంపై ఆందోళన కలిగిస్తోంది.