Begin typing your search above and press return to search.

యూర‌ప్‌ ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్న ఒక్క దేశం

By:  Tupaki Desk   |   13 March 2017 10:28 AM GMT
యూర‌ప్‌ ను అల్ల‌క‌ల్లోలం చేస్తున్న ఒక్క దేశం
X
ట‌ర్కీ దేశం నిర్వ‌హించాల‌నుకుంటున్న రెఫ‌రెండ‌మ్ ఇప్పుడు యూరోప్ దేశాల‌కు త‌ల‌నొప్పిగా మారింది. ఏప్రిల్ 16న ట‌ర్కీలో ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ నిర్వ‌హించ‌నున్నారు. పార్ల‌మెంట్ వ్య‌వ‌స్థ స్థానంలో మ‌రింత ప‌టిష్ట‌మైన‌ ప్రెసిడెంట్ వ్య‌వ‌స్థ‌ను ఏర్ప‌ర‌చాల‌ని ఆ దేశాధ్య‌క్షుడు రిసైప్ ఎర్డ‌గోన్ నిర్ణయించారు. అయితే యూరోప్ దేశాల్లో సుమారు 50 ల‌క్ష‌ల మందికిపైగా ట‌ర్కీ ప్ర‌జ‌లు నివ‌సిస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్న‌ ట‌ర్కీలంతా రెఫ‌రెండ‌మ్‌ లో ఓటేసేందుకు అర్హులే. ఈ నేప‌థ్యంలో ట‌ర్కీ ప్ర‌భుత్వం దాదాపు అన్ని యూరోప్ దేశాల్లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్న‌ది. ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ల ప‌ట్ల కొన్ని యూరోప్ దేశాలు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ ద‌గ్గ‌ర నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్ట‌రాద‌ని జ‌ర్మ‌నీ - నెద‌ర్లాండ్స్ దేశాలు ఇప్ప‌టికే తేల్చిచెప్పాయి. దీంతో ఆ దేశాల‌పై ఎర్డ‌గోన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్మ‌నీ - నెద‌ర్లాండ్స్ దేశాల్లో ఇంకా నాజీ పోక‌డ‌లు ఉన్నాయ‌ని ఆరోపించారు.

అయితే ఎర్డ‌గోన్ వ్యాఖ్య‌ల‌ను యూరోప్ దేశాలు తీవ్రంగా ఆక్షేపించాయి. ట‌ర్కీలో ప్ర‌జాస్వామ్య విలువ‌లు దిగ‌జారిపోయాయ‌ని డ‌చ్ పీఎం లార్స్ లాక్కీ రాస్‌ ముసెన్ విమ‌ర్శించారు. అంతేకాదు, ట‌ర్కీ మంత్రితో నిర్వ‌హించాల్సిన స‌మావేశాన్ని కూడా డెన్మార్క్ ర‌ద్దు చేసుకున్న‌ది. జ‌ర్మ‌నీ కూడా ట‌ర్కీ నిర్వ‌హించాల‌నుకుంటున్న ప్ర‌ద‌ర్శ‌నల‌ ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసింది. ట‌ర్కీ దేశ‌స్థులు జ‌ర్మ‌నీలో ప్ర‌చారం నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ దేశ హోం మంత్రి అన్నారు. కేవ‌లం జ‌ర్మ‌నీలోనే సుమారు 15 ల‌క్ష‌ల మంది టుర్కులు ఉన్నారు. స్వీడెన్ కూడా ట‌ర్కీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లను ర‌ద్దు చేసింది. ఒక‌వేళ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో ఎర్డ‌గోన్ గెలిస్తే, ఆయ‌న‌కు అమిత‌మైన అధికారాలు వ‌స్తాయి. కొత్త రెఫ‌రెండ‌మ్ ద్వారా మంత్రుల నియ‌మాకం చేసుకునే వీలు ఉంటుంది. బ‌డ్జెట్‌ను రూపొందించుకునే అవ‌కాశం ఉంటుంది. సీనియ‌ర్ జ‌డ్జిల నియామ‌కం, కొత్త చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా జ‌రిగే వీలు ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/