Begin typing your search above and press return to search.
లాక్‌డౌన్ వేళ స్పైడర్ మ్యాన్ సేవాభవం.. పొరిగింటోళ్లకు సహాయం
By: Tupaki Desk | 21 April 2020 8:30 AM ISTకరోనా లాక్‌డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆయా రంగాల ప్రముఖులు సేవాభావంలో మునిగారు. లాక్‌డౌన్ వేళ ఆయన సేవాభావం చాటుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకోవటానికి మార్వెల్ సూపర్ హీరో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భవంతుల మీద గంతులేస్తూ చిన్నాపెద్దను ఆకట్టుకున్న సూపర్‌మ్యాన్ ఇంటికే పరిమితమై పక్కింటోళ్లకు సహాయం చేస్తున్నాడు. ఈ సూపర్ హీరో నేల మీద నడుస్తూ తన చుట్ట పక్కల ఇళ్ల వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తూ అండగా నిలుస్తున్నాడు. టర్కీకి చెందిన బురఖ్ సోయ్‌లు స్పైడర్ మ్యాన్‌లా డ్రెస్ వేసుకుని లాక్‌డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాకుండా సహాయం చేస్తున్నారు.
పొరిగింటి వారికి సహాయం చేయడమే నాకున్న అద్భుత శక్తి అని ఈ రీల్ హీరో రియల్ హీరో అవుతున్నాడు. ఈ హీరో అందిస్తున్న సేవా కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ స్పైడర్ మ్యాన్‌ను రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా మిగతా వారిని కూడా సహాయం చేయాలని మార్వెల్ సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ ఇళ్లల్లోకే పరిమితమవ్వాలని చెబుతున్నారు.