Begin typing your search above and press return to search.

గూగుల్ తెలుగు లాంచ్ లో తుపాకీకి ప్రాముఖ్యత

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:15 PM GMT
గూగుల్ తెలుగు లాంచ్ లో తుపాకీకి ప్రాముఖ్యత
X
డిజిటల్ ప్రపంచంలో నిఖార్సైన వార్తలతో రాజకీయాలు సినిమాలతో పాటు వర్తమాన ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విశేషాలను అందిస్తున్న తుపాకీ వెబ్ సైట్ కున్న ప్రాముఖ్యత ఈ రోజు గూగుల్ తెలుగు లాంచ్ వేదికగా నిర్వాహకులే చాటి చెప్పారు. ఇప్పటి దాకా ఇంగ్లీష్ బాషకే పరిమితమైన గూగుల్ యాడ్ సెన్స్ మరియు యాడ్ వర్డ్స్ ను తెలుగు భాషకు విస్తరింపజేస్తూ జరిగిన కార్యక్రమానికి తుపాకీ టీమ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎనిమిదేళ్ల ప్రస్థానంలో తుపాకీ అగ్ర స్థానానికి చేరుకోవడానికి గల కారణాలతో పాటు కంటెంట్ ను చదువరులకు చేరువగా ఇంకా బాగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోవచ్చో అడిగి మరీ తెలుసుకోవడం విశేషం.

గూగుల్ హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజన్ ఆనందన్ మాట్లాడుతూ ఇది వెబ్ పబ్లిషర్స్ తో పాటు అడ్వటైజర్స్ కు కూడా ఎంతో ఉపయోగపడుతుందని వివరిస్తూ గూగుల్ లో తెలుగు భాషను ఉపయోగించే వారి సంఖ్య భవిష్యత్తులో 90 మిలియన్లకు చేరువ కాబోతోందని ఈ నేపధ్యంలో తుపాకీ లాంటి వెబ్ సైట్స్ పోషించే పాత్ర గురించి వివరించారు. పేరొందిన ప్రముఖ ఆన్ లైన్ పత్రికలతో పాటు సినిమా రంగ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో తుపాకీ ప్రతినిధులకు సముచిత స్థానం ఇవ్వడం ద్వారా ఆన్ లైన్ వేదికలో తుపాకీ ఆదరణను గూగుల్ స్వయంగా గుర్తించినట్టు అయ్యింది.ఆర్కా మీడియా అధినేత బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఇందులో పాల్గొన్నారు. కాకలు తీరిన మీడియా సంస్థలకు అరుదుగా దక్కే గౌరవం కేవలం పాఠకుల ఆదరణ వల్లే సాధ్యమయ్యిందని వార్తా సేకరణ చేసి సకాలంలో వాటిని అందించేందుకు రాజీ ప్రసక్తే లేని తమ విధానాన్ని తుపాకీ ప్రతినిధి గూగుల్ సభ్యులకు వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న తుపాకీ కి ఇచ్చిన ప్రాధాన్యం తమ బాధ్యతను రెట్టింపు చేసిందని ఇకపై ఇంకా అప్రమత్తంగా వార్తలను చేరవేసే యజ్ఞాన్ని కొనసాగించబోతున్నట్టు ప్రతినిధి స్పష్టం చేసారు. భారతీయ బాషలకు సంబంధించి మరో మూడేళ్ళలో ఆన్ లైన్ యూజర్లు 536 మిలియన్ల చేరుతారు అనే అంచనా ఉండగా అందులో తెలుగు వాడేవాళ్ల శాతమే 30 శాతం దాకా ఉండబోతోంది.అందుకే తెలుగు ప్రాముఖ్యతను గుర్తించిన గూగుల్ ఇంకా మెరుగుపరిచే దిశగా గూగుల్ యాడ్ సెన్స్ మరియు యాడ్ వర్డ్స్ ను తెలుగులో లాంచ్ చేయటమే కాక తుపాకీ లాంటి వెబ్ సైట్ నిబద్దతను గుర్తించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.