Begin typing your search above and press return to search.
కాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేది తప్పని తేల్చటంలో కీలకం ఎవరు?
By: Tupaki Desk | 21 Oct 2020 1:00 PM ISTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రజలకు బాగానే తెలుసు. తాను చేసే పని గురించి ఆయన ఎంత గొప్పగా చెబుతారో? ఎంత విజన్ తో తాను ప్లానింగ్ చేస్తానన్న విషయంతో పాటు.. సదరు పనితో కలిగే ప్రయోజనాల్ని వివరించటం.. ఆ క్రమంలో తాము కించిత్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆయన అస్సలు మాట్లాడరు. అలాంటి కేసీఆర్ చెప్పే మాటల్లో అసత్యాలు ఉన్నాయన్న విషయాన్ని తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్ తన తాజా తీర్పుతో స్పష్టం చేసింది.
కేసీఆర్ కలల ప్రాజెక్టుగా అభివర్ణించే కాళేశ్వరం ప్రాజెక్టుకు నిబంధనలకు విరుద్ధమని.. ఉల్లంఘనలతో నిర్మించినట్లుగా తేల్చారు. అంతేకాదు.. అదెప్పటికి తాగునీటి ప్రాజెక్టు కానే కాదని స్పష్టం చేసింది. ఇంతకీ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు..తప్పులు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని లేవనెత్తింది ఎవరు? వారు ఎక్కడి వారు అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీఎం కేసీఆర్ లాంటి పెద్ద మనిషి చేసిన పని తప్పు అన్న విషయాన్ని జాతీయ స్థాయిలో తేల్చేలా చేయటం అంత చిన్న విషయం కాదు. దానికి భారీ కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై షాకింగ్ తీర్పును జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇవ్వటం తెలిసిందే. ఇంతకూ అక్కడి వరకు వెళ్లిందెవరు? అన్న విషయంలోకి వెళితే.. తెలంగాణలోని సిద్దిపేట కు చెందిన తుమ్మనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈయన మూడో టీఎంసీ విస్తరణ పనులకు అనుమతులు లేవని ఆరోపిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్రమంగా పర్యావరణ అనుమతులు తీసుకున్నారంటూ హయాతుద్దీన్ ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
వేర్వుగా నమోదైన ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించింది ఎన్జీటీ.తాజాగా తీర్పును ఇచచిన టీంలో ముగ్గురు న్యాయ నిపుణులు ఉన్నారు. ఎన్జీటీ ఛైర్మన్ జస్టిస్ ఏకే గోయల్..న్యాయసభ్యుడు జస్టిస్ ఎస్పీ వాంగ్డీ.. సభ్య నిపుణులు నాగిన్ నందాలలు ఉన్నారు. వారు తమ తీర్పును వెల్లడించారు. మరి.. ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.