Begin typing your search above and press return to search.

బీజేపీ గూటికి తుమ్మల.. అసలు క్లారిటీ ఇదే

By:  Tupaki Desk   |   18 Nov 2020 9:31 AM IST
బీజేపీ గూటికి తుమ్మల.. అసలు క్లారిటీ ఇదే
X
మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు త్వరలో బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో ఆప్రచారం మరింత ఎక్కువైంది. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడానికి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రాజకీయ అనుచరుల్లో.. ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.అయితే ఈ ప్రచారంపై తుమ్మల ఇప్పటివరకు స్పందించలేదు.

అయితే ఇదంతా ఫేక్ న్యూస్ గా తేలిపోయింది. ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్న ప్రకారం అలాంటి ఆలోచన ఏదీ తుమ్మల మదిలో లేదని వారు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలై మంత్రిపదవి కోల్పోయినా.. ఏ ఎన్నికలు వచ్చినా.. ఆయనే ముందుండి నడిపించారని.. టీఆర్ఎస్ ను లీడ్ చేస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు.

తాజాగా జరిగిన రైతు వేదిక ప్రారంభోత్సవంలోనూ తుమ్మల పాల్గొన్నారని.. తుమ్మల బర్త్ డే ను టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారని ఆయన సన్నిహితులు తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. కేసీఆర్ కు తుమ్మల అత్యంత సన్నిహితుడు అని తెలిపారు.ఏ విధంగా చూసినా తుమ్మల టీఆర్ఎస్ పార్టీని వీడరని.. బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరబోరని చెబుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు బలమైన నేతగా పేరుంది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఖమ్మంలో తిరుగునేతగా మారాడు. మంత్రిగా వుండి కూడా, గత 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మల నాగేశ్వర్ రావు ఓడిపోయారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి పదవీని దక్కించుకోలేకపోయారు. ఓడిన నేతలకు కేసీఆర్ ఈసారి పదవులు ఇవ్వలేదు.