Begin typing your search above and press return to search.

హిందువు అయితే పోటీ చేయకూడదా..?

By:  Tupaki Desk   |   30 Jan 2019 2:04 PM GMT
హిందువు అయితే పోటీ చేయకూడదా..?
X
మతాల చిచ్చు భారతోనే కాదు - అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుందనిమరోసారి రుజువైంది. ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఓ వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు రావడం బాధాకరం.

హవాయి దీవులకు చెందిన డెమక్రటిక్ పార్టీ అభ్యర్థి తులసీ గబార్డ్ - అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన విషయం తెలిసిందే. తను కూడా అధ్యక్ష పదవికి పోటీచేస్తానంటూ కొన్ని రోజుల కిందట ఆమెప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఆమెపై హిందూ వాది ముద్రవేసే ప్రయత్నం చేశారు రిపబ్లికన్లు.

అమెరికాలో పుట్టి - అక్కడే పెరిగిన వ్యక్తి తులసీ గబార్డ్. కాకపోతే హిందూ సనాతన ధర్మ - హిందూమతం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనేయుక్తవయసులో హిందూ మతాన్ని స్వీకరించారు. కృష్ణుడిని మనసారా ఆరాధిస్తారు. అదే ఆమె పై విమర్శలకు కారణమైంది. 2012లో కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు సృష్టించారు తులసీ గబార్డ్.