Begin typing your search above and press return to search.
టీటీడీ తాజా పరిశోధన.. హనుమంతుడు పుట్టింది అక్కడేనా?
By: Tupaki Desk | 17 Dec 2020 11:12 AM ISTపురాణాల్లో పేర్కొనే అంశాల్ని వాస్తవ ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటిరకు అంజనేయ స్వామి జన్మస్థలి మీద జరిగే ప్రచారానికి.. వాస్తవానికి మధ్య ఎంత దగ్గర ఉందన్న విషయాన్ని తేల్చే ప్రయత్నానికి నడుం బిగించారు. ఇందుకోసం టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈవో కేఎస్ జవహర్ రెడ్డి. పలువురు పండితులతో భేటీ అయిన ఆయన.. ఈ అంశంపై విస్తృతంగా పరిశోధనలు జరపాలని.. ఆధారాలతో నిరూపించాలని కోరారు.
టీటీడీ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొన్న జవహర్ రెడ్డి..కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చారిత్రక.. ఆచార వ్యవహారాలతో హనుమంతుడు తిరుమలలోనే పుట్టారన్న విషయాన్ని పరిశోధించి.. నిరూపించాలన్నారు.
పురాణాల ఆధారంగా తిరుమల ఆంజనేయస్వామి జన్మ స్థలమని సమావేశంలో పాల్గొన్న పండితులు పలువురు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. శ్రీవారి భక్తులందరికి అంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలన్న జవహర్ రెడ్డి.. అందుకు తగిన సమాచారాన్ని సిద్ధం చేయాల్సిందిగా కోరారు.
స్కంద పురాణం.. వరాహ పురాణం.. పద్మ పురాణం.. బ్రహ్మాండ పురాణం.. వెంకటాచల మహత్యం.. భవిష్యత్తోత్తర పురాణంలోని శ్లోకాల ఆధారంగా హనుమంతుడి జన్మస్థలాన్ని శోధించాలని కోరారు. త్వరలోనే ఈ అంశాన్ని ఆధారాలతో సహ పరిష్కరించే ప్రయత్నం చేయాలని అదనపు ఈవోనుకోరారు. అనుకున్నదే జరిగితే.. తిరుమల పుణ్యక్షేత్రం మరింత పాపులర్ కావటం ఖాయం.