Begin typing your search above and press return to search.
టీటీడీ ఈవో సింఘాల్ పదవీ సమయం మరోసారి పొడగింపు!
By: Tupaki Desk | 18 July 2020 9:22 AM ISTతిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఈవోగా పని చేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కొనసాగాలని ఆ ఉత్తర్వులో తెలిపింది.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ను 2017 మేలో టీటీడీ 25వ ఈవోగా డిప్యూటేషన్ పై తీసుకువచ్చారు. టీటీడీ ఈవోగా రెండేళ్ల పాటు ఉండే ఈ పదవిలో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్ ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి డిప్యూటేషన్ ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ టీటీడీ ఈవో కొనసాగాలని స్పష్టం చేసింది.
అయితే , తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా టీటీడీ ఈవో సింఘాల్ టార్గెట్ గా కీలక చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ చంద్రబాబు ఆజ్ఞలను పాటిస్తూ.. కోర్టు ఆదేశాలను, జగన్ సూచనలను పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ఈవో గా మరోసారి సింఘాల్ కొనసాగాలని ఆ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. సింఘాల్ గత టీడీపీ హయాంలో ఈవోగా నియమితులైనా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయనే కొనసాగుతుండటం గమనార్హం.