Begin typing your search above and press return to search.

టీఎస్పీఎస్సీ : ఇక ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ కష్టమే

By:  Tupaki Desk   |   18 March 2023 12:00 PM GMT
టీఎస్పీఎస్సీ : ఇక ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ కష్టమే
X
తెలంగాణలో 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సమావేశాల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కళ్లల్లో ఆనందం వెల్లివెరిసింది. ఇంతకాలానికైనా కొలువు కొట్టాలన్న పట్టుదలతో చాలా మంది దీక్షలు చేపట్టి చదువడం ప్రారంబించారు. కొందరు కోచింగ్ సెంటర్లకు వేల రూపాయలు వెచ్చించి ముందే సీటు సంపాదించుకున్నారు. ఈ తరుణంలో టీఎస్ పీఎస్సీ కమిషన్లో తప్పిదాలు, ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం చూస్తే ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ కష్టమే అని అంటున్నారు.

గత అసెంబ్లీ (2022) సమావేశాల్లో సీఎం ప్రసంగిస్తూ రేపటి నుంచే జాబ్ క్యాలెండర్ మొదలవుతుందని చెప్పారు. కానీ ఇంతవరకు పోలీస్ నియామకాలు, కొన్ని వైద్యుల పోస్టులు తప్ప మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇక టీఎస్ పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు జారీ అవుతున్నా లీకేజీల వ్యవహారంతో పాటు కమిషన్లో జరుగుతున్న తప్పిదాలతో నిరుద్యోగుల్లో నిరాశ ఎదురువుతోంది. లీకైన పేపర్ల విచారణతో పాటు లోటు పాట్లు సరి చేయడానికి మరో మూడు నెలల సమయం పట్టనుంది. అప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే ఇక పరీక్షల నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీఎస్ పీఎస్ సీ కమిషన్ లో ఏర్పడ్ల లోపాలను చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతోంది. ఇప్పటికీ జారీ అయిన నోటిఫికేషన్ల పరీక్షలను ఆగస్టులోపు నిర్వహించి భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్లో ఎన్నికల షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే అప్పటికీ పూర్తి కాకపోయి ఆలస్యమయితే ఈ నియామకాలు వచ్చే ప్రభుత్వంలోనే చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు.

2018 తరువాత టీఎస్ పీఎస్ సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లలో కొందరికి పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగతావన్నీ అంతకుముందు నోటిఫికేషన్ జారీ చేసినవేనని అంటున్నారు. ఇక తాజా నోటిఫికేషన్లపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇటీవల ఎఈ ఎగ్జామ్ తో పాటు తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రద్దు చేశారు. టీఎస్ పీఎస్సీ లోపాలను సరిదిద్ది ఎగ్జామ్స్ నిర్వహించినా అభ్యర్థులో ఆందోళన భయం పోవడం లేదు. అయితే ఇదంతా చక్కబడడానికి మాత్రం చాలా సమయమే పడుతుందని అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రభత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.