Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రులు మెట్రో రైలెక్కారు

By:  Tupaki Desk   |   18 Dec 2015 4:50 PM IST
తెలంగాణ మంత్రులు మెట్రో రైలెక్కారు
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నతెలంగాణ ప్రభుత్వం తాజాగా మెట్రో రైలునూ అందుకు పావుగా వాడుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకు మెట్రోపై పెద్దగా కదలని ప్రభుత్వం ఒక్కసారిగా దానిపై పడింది. శుక్రవారం ఏకంగా మంత్రులు మెట్రో రైలులో ప్రయాణించి పరిశీలించారు.

మెట్రో రైల్ పనుల విషయంలో జాప్యం జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికి... ప్రజల్లో మెట్రో ఆశలు కల్పించడానికి వీలుగా టీ మంత్రులు కెటిఆర్ - తలసాని శ్రీనివాసయాదవ్ - కెటిఆర్ - ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ లు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైల్ ప్రయాణం అద్బుతంగా ఉందని వారు చెప్పుకొచ్చారు. మెట్టుగూడ-నాగోల్ మద్య ప్రయాణించిన వారు మొత్తం వ్యవస్థను పరిశీలించారు.

మెట్రోలు రైలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని.. భద్రంగా వేగంగా గమ్యం చేర్చడానికి ఇది మంచి మార్గమని కేటీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చారు. మెట్రో పూర్తి అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని తలసాని అన్నారు. వీలైనంత వేగం ఇది పూర్తయ్యేలా చూస్తామని వారు చెప్పుకొచ్చారు.