Begin typing your search above and press return to search.
గవర్నర్ ఎపిసోడ్ః లౌక్యంలో కేసీఆర్‌ను మించిపోతున్న తలసాని
By: Tupaki Desk | 22 April 2022 5:00 AM ISTతెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ అధికార టీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా హాట్ హాట్ రాజకీయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ పై విమర్శలు, ఆరోపణలు చేయడంలో టీఆర్ఎస్ నేతలు తమ వంతు పాత్ర పోషిస్తుండగా అందులో హైదరాబాద్ నగరానికి చెందిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందు వరుసలో ఉన్నారు.
సోమవారం చెన్నైలో గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తో గ్యాప్ నిజమేనని తెలిపారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్... గవర్నర్ తమిళి సై పై విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం ఏంటని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తమిళి సై పొలిటికల్ లీడర్ లా మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. అయితే, ఈ కామెంట్ల తర్వాత మరుసటి రోజే గవర్నర్ తో కలిసి ఓ కీలక పూజ కార్యాక్రమంలో తలసాని పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.
సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వర్ణ బంధన మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచ్చేశారు. ఆలయ పండితులు గవర్నర్ తమిళిసైకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూజలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం గవర్నర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు.
గవర్నర్ తమిళసై విషయంలో టీఆర్ఎస్ నేతలు ఓ వైపు దూకుడుగా స్పందిస్తూ ఆమె పాల్గొన్న వివిధ కార్యక్రమాల్లో ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటుంటే... తలసాని మాత్రం తమ ఇలాకా అయిన సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా లౌక్యంగా వ్యవహరించారని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడలకు తగినట్లుగా పనిచేయడమే కాకుండా ఆయన లౌక్యాన్ని సైతం తలసాని ఒడిసి పట్టుకున్నారని చెప్తున్నారు.