Begin typing your search above and press return to search.

పిక్ టాక్: అమెరికాలో అల్లుడిని కలిసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   30 March 2022 9:19 PM IST
పిక్ టాక్: అమెరికాలో అల్లుడిని కలిసిన కేటీఆర్
X
తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం ఈనెల 18న అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు జరిపారు. తెలంగాణలో 8వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

 మంత్రి కేటీఆర్ అమెరికాకు వ్యాపార పర్యటనలో తాజాగా తన మేనల్లుడిని సైతం కలుసుకున్నారు. తెలంగాణకు వ్యాపార పెట్టుబడులను తీసుకురావాలనే తపనతో ఆయన పలు వ్యాపార సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నవేళ గ్యాప్ లో తన మేనల్లుడితో సరదాగా గడిపారు.

కేటిఆర్ తన అమెరికా ట్రిప్ మధ్యలో ఉండగా  అమెరికాలో చదువుతున్న తన మేనల్లుడు ఆదిత్య(సోదరి కవిత కుమారుడు)ను కలవడానికి సమయం కేటాయించారు. ఈ మేరకు కవిత సంబంధిత ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.. "బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన క్యాంపస్‌లో ఆదిత్యను కలవడం మిస్ చేసుకోని ప్రియమైన  మామయ్య(కేటీఆర్)తో నా కొడుకు.  ప్రేమతో" అంటూ కవిత ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.

 కేటీఆర్ ఈ ఫొటోలో ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించారు. తన అల్లుడుతో పాటుగా పోజులిచ్చేటప్పుడు  క్యాజువల్ లుక్ లో కాకుండా నవతరం దుస్తుల్లో కనిపించాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్‌ఎస్ సేనలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.