Begin typing your search above and press return to search.

యాద‌గిరి గుట్ట : అయ్యో ! చంద్రుడు రాలే ఇంద్రుడొచ్చిండే !

By:  Tupaki Desk   |   9 May 2022 12:30 AM GMT
యాద‌గిరి గుట్ట : అయ్యో ! చంద్రుడు రాలే ఇంద్రుడొచ్చిండే !
X
యాద‌గిరిగుట్టకు సంబంధించి సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు స్పందిస్తున్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాత్రం టేక్ ఇట్ ఈజీ పాల‌సీ అన్న ధోర‌ణిలో మాట్లాడుతున్నార‌ని వీరంతా మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న విమ‌ర్శ‌ల ఆధారంగా రాస్తున్న క‌థ‌నం ఇది. ఇదే స‌మ‌యాన హిందూ ధార్మిక ప‌రిష‌త్-లు కూడా స్పందిస్తున్నాయి. యాద‌గిరి గుట్ట ఆల‌య నిర్మాణ వైభవం అంటే ఇదేనా అని ప్ర‌శ్నిస్తున్నాయి. అవి కూడా ప‌రిగ‌ణిస్తే కేసీఆర్ స‌ర్ మంచి ఆల‌య నిర్మాణాల‌కు మ‌రిన్ని ప్ర‌ణాళికల‌కు పూనిక వ‌హించ‌వ‌చ్చు.

యాద‌గిరి గుట్టకు కేసీఆర్ వ‌స్తార‌ని అంతా అనుకున్నారు. అంటే లోపాల‌ను దిద్దుతార‌ని కానీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాలేదు. పోనీ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాలేదు. పోనీ ఎలా అనుకున్నా నార‌సింహుని భ‌క్తుడు కేసీఆర్ రానే రాలేదు. వెయ్యి కోట్ల‌కు పైగా క‌ట్టిన క‌ట్ట‌డంలో వైఫ‌ల్యాల‌ను దిద్దాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? ఎవ‌రు మాట్లాడాలి ? ఎవరు ఏ విధంగా వాటికో బాధ్య‌త అన్న‌ది వ‌హించి తీరాలి? ఇవ‌న్నీ మంత్రి (దేవాదాయ శాఖ‌) ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని అడ‌కండి.చెప్తారు.

ఏ విధంగా ఇక్క‌డ ఉండాలో ఏ విధంగా ఇక్క‌డ న‌డుచుకోవాలో.. ఏ విధంగా నిర్మాణ సంబంధ లోపాల‌ను చూడాలో అన్న‌వి.. ఎందుకంటే ఆయ‌న స‌మ‌స్య‌ల‌ను భూత‌ద్దంలో పెట్టి చూడవ‌ద్దు అని అంటున్నారు. ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నులు పూర్తయి కొద్ది నెల‌లు కూడా గ‌డ‌వ‌క ముందే ఇటువంటి లోపాలు క‌నిపిస్తే ప్ర‌శ్నించ‌కూడ‌దా? ఘాట్ రోడ్డు రెండు గా చీలిపోతే, కుంగిపోతే అడ‌గ‌కూడ‌దా ? ఏ స‌మ‌స్య‌నూ మీరు ప‌ట్టించుకోకండి అని చెబితే స‌రిపోతుంది క‌దా ! మంత్రి వ‌ర్యా ! అప్పుడు ఎవ్వ‌రూ సోష‌ల్ మీడియాలో ఏమీ రాయ‌రు. ఏమీ అన‌రు.. ఏ కొద్ది పాటి వ్య‌క్తులు ర‌హస్యంగా ఉద‌యం కురిసిన వాన‌కు ఇలా జ‌రిగిపోయిందే అని చెప్పి వ‌స్తారు..అంత‌కుమించి ఏం చేయ‌గ‌లం చెప్పండి..

మేం అంతా సామాన్యులం..మీరు ఏమంటే అదే విని, చూసి, చెప్పి, వెళ్లిపోవడం మా ఆన‌వాయితీ కావాలి లేదా ఆల‌యం చెంత ఉన్న భ‌క్తుల ఆన‌వాయితీ అయినా కావాలి. దైవ ద‌ర్శ‌నంకు వ‌చ్చిన వారికి ఐదు వంద‌ల రూపాయ‌ల టికెట్ పార్కింగ్ రూపేణ పెట్టినా లేదా అటుపై నిర్ణీత సమ‌యం ముగిశాక గంట‌కు వంద చొప్పున అద‌నంగా వ‌సూలు చేసినా ఇవేవీ అడ‌గం. క్యూ లైన్లు జ‌ల‌మ‌యం అయినా కూడా అడ‌గం. క‌నుక మేం భూత‌ద్దం వాడుకోం ఇక‌పై ! అన్న‌ది ఇప్పుడు కొందరు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఆవేద‌న చెందుతూ స్పందిస్తూ ఉన్నారు.

ఈ నేప‌థ్యాన మాములుగా ఏమీ అన‌కండి.. ఏమీ చూడ‌కండి..ఏమీ పట్టించుకోవ‌డం కూడా చేయ‌కండి.. ఎందుకంటే అవ‌న్నీ ప్ర‌త్యేక‌త‌ల‌కు ఆన‌వాలుగా నిలిచిన నిర్మాణాలు. క‌నుక సాధార‌ణ రీతిలో స్పందించ‌డం క‌న్నా మ‌నం అసాధార‌ణ స్థాయిలో స్పందించ‌డం ఓ గొప్ప వ‌రం అని భావించాలి. కానీ మంత్రి మాత్రం భూత‌ద్దం వాడ‌కండి.. సమ‌స్య‌ల‌ను ఆ విధంగా చూడ‌కండి అని అంటున్నారు. హితవు చెబుతున్నారు. ఇదే ఇవాళ్టి వైచిత్రి ! ఓం న‌మో నార‌సింహాయా !