Begin typing your search above and press return to search.
ఏపీ ప్రాజెక్టుల్లో మేం ఎందుకు జోక్యం చేసుకుంటాం?
By: Tupaki Desk | 2 Sept 2020 11:15 AM ISTఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల్ని నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా స్పందించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పార్టీ నేత వంశీచందర్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ లు ఒక పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. వీరి వాదన ఏమంటే.. ఏపీలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్ జీటీ ఉత్తర్వులు ఇచ్చిన 90రోజుల్లో సుప్రీంలో అప్పీలు చేసుకునే వీలుంది.. ఆ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలుచేస్తే.. భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇవాళ దీనికి అనుమతి ఇస్తే.. రేపొద్దున ఉత్తరాఖండ్ నుంచి మరొకరు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ వస్తారని.. ఇలాంటి ఏ మాత్రం మంచిది కాదన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? లేదా? ఈ పథకం కొత్తదా? పాతదా? లాంటి అంశాల్ని తేల్చాల్సింది సుప్రీంకోర్టేనని స్పష్టం చేసింది. సుప్రీంలో తేలేవరకుదీనిపై విచారణను నిరవధికంగా వాయిదావేస్తున్నట్లు పేర్కొంది. తాజా పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్పందించిన తీరుతో అనవసరమైన లిటిగేషన్లతో మోకాలడ్డే వారికి చెక్ చెప్పినట్లు అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది.
దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై తాము ఎలా జోక్యం చేసుకుంటామని ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి ఎన్ జీటీ ఏమైనా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారా? అని ప్రశ్నించారు. ‘‘ఇందులో హైకోర్టు పాత్ర ఏముంటుంది? మీకు మీరే అనుకూల ఆదేశాలు వస్తాయన్న ఉద్దేశంతో పిటిషన్ వేస్తారా? సమస్య ఎన్ జీటీ ముందు ఉన్నప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయటం న్యాయ ప్రక్రియకు అడ్డుతగలటమే అవుతుంది. అక్కడిచ్చిన ఆదేశాల్ని అక్కడే సవరించాలని పిటిషన్ ఎందుకు వేయలేదు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.