Begin typing your search above and press return to search.
రూల్ ను పట్టించుకోకుండా ఓటేసిన ట్రంప్ సతీమణి
By: Tupaki Desk | 4 Nov 2020 10:15 AM ISTఓటు వేసి వార్తల్లోకి ఎక్కిన ప్రథమ మహిళగా మెలానియా ట్రంప్ ను చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణిగా.. అమెరికా ప్రథమ మహిళ హోదాలో ఉన్న ఆమె.. ఎన్నికల రోజున ఒక్కరే పోలింగ్ బూత్ కు వచ్చి మరీ ఓటేశారు. ఎర్లీ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోకుండా.. పోలింగ్ రోజున ఒక్కరుగా వచ్చి ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
పోలింగ్ కు ముందే ఓటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ట్రంప్ కొద్ది రోజుల క్రితమే తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెలానియా మాత్రం.. పోలింగ్ రోజునే ఓటేయాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లే.. భారీ సెక్యురిటీ నడుమ పామ్ బీచ్ లోని మోర్టన్ అండ్ బార్బరా మాండెల్ రీక్రియేషన్ సెంటర్లో ఓటేశారు. తాను పోలింగ్ రోజున ఫ్లోరిడా వచ్చి ఓటు వేయాలని అనుకున్నానని.. అందుకే ఈ రోజు వచ్చి ఓటేశానని మీడియాకు చెప్పారు.
పామ్ బీచ్ ప్రాంతంలో బయటకు వచ్చే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్కు ధరించాలన్న నిబంధన ఉంది. అయినప్పటికీ ఆ రూల్ ను లైట్ తీసుకున్న మెలానియా.. ఫేస్ మాస్కు లేకుండా వచ్చి ఓటేశారు. ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇటీవల ట్రంప్ తో పాటు మెలానియా.. ఆమె కుమారుడు కరోనా బారిన పడటం తెలిసిందే. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళలో ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను పట్టించుకోకుండా ఉండటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.