Begin typing your search above and press return to search.

ఆమెను నామినేట్ చేసిన ట్రంప్.. మరో వివాదానికి తెర లేచినట్లే

By:  Tupaki Desk   |   28 Sept 2020 11:00 AM IST
ఆమెను నామినేట్ చేసిన ట్రంప్.. మరో వివాదానికి తెర లేచినట్లే
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. తమ పదవీకాలం ముగిసే వేళలో కీలక నిర్ణయాన్ని తీసుకోవటానికి ఇష్టపడరు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకున్నా విమర్శలకు అవకాశం ఉంటుంది. అందుకే.. అలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అందరి బాటలో నడిస్తే ఆయన్ను ట్రంప్ అని ఎందుకు అంటారు?

మొండితనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. తానేం అనుకుంటానో దాన్నే చేయాలనుకునే అమెరికా అధ్యక్షుడి పుణ్యమా అని వివాదాలకు కొదవ లేదు. తాజాగా ఆయన అలాంటి వివాదానికి తెర తీశారు. అమెరికా సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తి ఎంపిక అన్నది.. అధ్యక్ష ఎన్నికల తర్వాత.. కొత్త అధ్యక్షుడు చేపడితే బాగుంటుందన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తున్నా.. ఆయన మాత్రం దాన్ని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా అమీకోనే బారెట్ అనే 48 ఏళ్ల మహిళను నామినేట్ చేస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. దేశంలోనే అత్యంత మేథాసంపత్తి కలిగిన వారిలో ఒకరైన ఆమెను జస్టిస్ గా నామినేట్ చేయటాన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఒకవేళ అమీ కానీ సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా ఎంపికైతే మాత్రం చరిత్రలో రికార్డుగా మారటం ఖాయం. ఎందుకంటే.. అమెరికా న్యాయవ్యవస్థలో ఇంత చిన్న వయసులోనే సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన వారు లేరు. ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ 87 ఏళ్ల రుథ్ బాడర్ గిన్స్ బర్గ్ మరణించటంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. కొత్త జడ్జిని అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎంపిక చేయాలన్న మాటను ట్రంప్ కు చెందిన రిపబ్లికన్లు సైతం పెద్ద ఎత్తున కోరుతున్నారు. అందుకు భిన్నంగాట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కొత్త రచ్చ షురూ అయినట్లేనన్న మాట వినిపిస్తోంది.