Begin typing your search above and press return to search.

నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్

By:  Tupaki Desk   |   9 Sep 2020 2:30 PM GMT
నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్
X
ఎప్పుడూ చైనాతో పాటు ఇరాన్, ఉత్తరకొరియా లాంటి దేశాలపై యుద్ధానికి సిద్ధం అంటూ రుసరుసలాడే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలవడం విశేషంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్, యూఏఈ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గాను ట్రంప్ ను నార్వే దేశం నామినేట్ చేసింది. 2021 నోబెల్ శాంతి పురస్కారం రేసులో ట్రంప్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు నామినేట్ చేయడం ఆసక్తి రేపుతోంది.

ఈ ఏడాది నోబెల్ శాంత పురస్కారం రేసులో హాంగ్ కాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమకారులు కూడా ఉన్నారని సమాచారం. అయితే నార్వే ఈ ప్రతిపాదన చేయగా చైనా విదేశాంగ మంత్రి నార్వే వెళ్లి మరీ ఆ దేశాన్ని హెచ్చరించి వచ్చారు. దీంతో నార్వే ట్రంప్ ను నామినేట్ చేసింది.

అరబ్ దేశాల్లో ఇన్నాళ్లు యూదు దేశమైన ఇజ్రాయిల్ ను వెలివేశారు. దీంతో యూఏఈతో ఇజ్రాయిల్ బంధానికి ట్రంప్ చొరవ చూపారు. అరబ్ దేశాలను ఒప్పించేందుకు అమెరికా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చొరవకు నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేశారు.

అమెరికా అధ్యక్షుల్లో బరాక్ ఒబామాకు ఇంతకు ముందు నోబెల్ శాంతి బహుమతి పురస్కారం దక్కింది. ఇప్పుడు ట్రంప్ కు వస్తుందా రాదా అన్నది వేచిచూడాలి.