Begin typing your search above and press return to search.

అదే జరిగితే భారీ మూల్యం చెల్లించుకుంటారు ...ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   2 April 2020 5:42 AM GMT
అదే జరిగితే భారీ మూల్యం చెల్లించుకుంటారు ...ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
X
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తుంది. ఈ కరోనా దెబ్బకి అమెరికా సైతం వణికిపోతోంది అంటే కరోనా ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు అమెరికాలోనే అత్యధికంగా 2 .15 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 47 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాబోయే 30 రోజులు గడ్డు కాలమే, అమెరికన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్తూనే.. అమెరికాపై దాడి చేయడానికి సిద్ధపడుతున్న వారికీ హెచ్చరికలు జారీచేశారు.

ఇరాన్‌ లోని అమెరికా సైనిక బలగాలపై కానీ, ఆస్తులపై కానీ.. ఇరాన్‌ లేదా దాని అనుబంధ సంస్థలు దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఇరాన్‌, దాని అనుబంధ సంస్థలు ఇరాన్‌ లోని అమెరికా సైనిక బలగాలపై, ఆస్తులపై దాడి చేయటానికి వ్యూహాలు రచిస్తున్నట్లు అధికారిక సమాచారం అందింది. అదే జరిగితే.. ఇరాన్‌ ఇందుకు ప్రతిఫలంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇకపోతే , ఇరాన్, అమెరికా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొనిఉంది. జనవరి 4న బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన రాకెట్‌ దాడులలో ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు అమెరికా , ఇరాన్ మధ్య శత్రుత్వానికి కారణం అయ్యింది. ఇరాక్‌ లోని అమెరికా అధికారులపై జరిగిన దాడుల్లో సులేమానీ కీలక పాత్ర పోషించాడని, వందలాది మంది అమెరికా, దాని సంకీర్ణ సేనలకు చెందిన సభ్యుల మృతికి ఆయన కారణమైనందుకే దాడి చేసినట్లు అమెరికా ప్రకటించింది.