Begin typing your search above and press return to search.
ట్రంప్ టూర్ ని టార్గెట్ చేసిన జైషే మహమ్మద్..నిఘా వర్గాల హెచ్చరికలు !
By: Tupaki Desk | 17 Feb 2020 2:45 PM ISTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ పర్యటనకి రానున్నారు. ఈ పర్యటనని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని అన్ని ఏర్పాట్లని ఇప్పటికే సిద్ధం చేసింది. అలాగే ట్రంప్ ఇండియా కి వస్తుండటం తో దేశీయ కార్పోరేట్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అమెరికన్ కంపెనీలు , మనదేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు జరగొచ్చు అని ఊహిస్తున్నారు. అమెరికా నుండి పెట్టుబడులు వచ్చేలా ఈ పర్యటన ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు. ఇక అమెరికా అధినేత మనదేశానికి రాబోతుండటం తో .. స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న అధిక టారిఫ్ నుండి మినహాయింపు కావాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే, దానితో పాటుగా జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) కింద కొన్ని దేశీయ ఉత్పత్తులకు ఎగుమతి ప్రయోజనాలు తిరిగి ప్రారంభించాలని కోరుతోంది.అలాగే వ్యవసాయ, ఆటోమొబైల్, ఆటో విడిభాగాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులపై ఈ ప్రయోజనాలు కల్పించాలని కోరుతోంది. ఇదే సమయంలో భారత్ ముందు అమెరికా కూడా కొన్ని డిమాండ్స్ ని ఉంచింది. వ్యవసాయ, ఉత్పాదక ఉత్పత్తులు, పాల వస్తువులు, వైద్య పరికరాలు, డేటా స్థానికీకరణ, సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు తగ్గించాలని భారత్‌ను కోరుతోంది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సదస్సులో పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అమెరికన్ దిగ్గజ సంస్థలు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, భారతి ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఇకపోతే , ఇదే సమయం లో ఈ పర్యటన పై పాక్ కూడా ఫోకస్ పెట్టినట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ట్రంప్ టూర్ ని టార్గెట్ చేసుకొని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారీగా ఉగ్ర దాడులకు పాల్పడబోతున్నట్టు సమాచారం. దాడులు చేస్తామంటూ ఆ సంస్థ ఏకంగా ఓ వీడియోనే విడుదల చేయడం తో.. ట్రంప్ టూర్ కు కనీవినీ ఎరుగని రీతిలో భారత ప్రభుత్వం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. భారత్ లో ఉన్న ముస్లింలను వేధిస్తున్నందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ జైషే మహ్మద్ హెచ్చరించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఖురాన్ షరీఫ్ అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో మేమిప్పటిదాకా శాంతంగా ఉన్నాం.. ఇక ఉపేక్షించేది లేదు..ప్రతి తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే అంటూ చెప్పడం కన్పిస్తుంది.. పుల్వామా అటాక్ తర్వాత జైషే మహ్మద్ స్థావరాలపై భారత్ చేసిన మెరుపుదాడులు చేయడంతో ఆ సంస్థ దాదాపుగా చావు అంచున నిల్చుంది. కానీ , తాజాగా అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన సందర్భంగా ఏదో విధ్వంసం సృష్టిస్తే, తమ ఉనికి చాటాలని జైషే మహ్మద్ వ్యూహం అని తెలుస్తుంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో అశాంతి.. అస్థిరత నెలకొన్నదని చెప్పడానికే జైషే మహ్మద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనితో జైషే మహ్మద్ హెచ్చరికలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతవారం పీఓకేలో టెర్రరిస్టు సంస్థలు ప్రత్యేకం గా సమావేశమయ్యాయని భారత నిఘా టీమ్స్ పసిగట్టాయి. ఆ మీటింగ్ పై ఆరాతీయ గా ట్రంప్ టూర్ ని జైష్ టార్గెట్ చేసినట్టు బయట పడింది. ఈ వ్యవహారం అంతా పాక్ వెనుక ఉంది నడిపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే ట్రంప్ పర్యటించే సమయంలో గుజరాత్ లో భారీగా సెక్యూరిటీ ఉంటుంది దీని తో ఆ సమయంలో ఇతర ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జమ్ము కశ్మీర్‌లో పోలీసులు..భద్రతదళాలు, సాధారణ పౌరులు..ఇలా ఎవరు దొరికితే వారి పై దాడులు చేయడమే జేైషే మహ్మద్ తాజా వ్యూహం అని నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే , జైష్ దాడుల్ని తిప్పికొడతామని మన ఆర్మీ సైన్యాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.