Begin typing your search above and press return to search.

సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ జోడీ ...మూడు కోతుల కథ చెప్పిన మోడీ !

By:  Tupaki Desk   |   24 Feb 2020 8:45 AM GMT
సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ జోడీ ...మూడు కోతుల కథ చెప్పిన మోడీ !
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. దంపతులు సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయ 11 :30 నిముషాలకి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు కి చేరుకున్న ట్రంప్ కి ,ప్రధాని మోడీ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తరువాత అక్కడినుండి 23కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆశ్రమానికి నిమిషాల్లో వ్యవధిల్లోనే చేరుకున్నారు ట్రంప్ దంపతులు. దారి పొడుగునా భారీ ర్యాలీతో ట్రంప్‌కు వెల్‌కమ్ చెప్పారు గుజరాత్ వాసులు. ఆశ్రమానికి చేరుకోగానే దంపతులిద్దరూ చెప్పులు విప్పి లోనికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మరో రికార్డ్ నెలకొల్పాడు. తోలిసారి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ స్థిర స్థాయిగా నిలవనున్నారు.

ఇక , ఆశ్రమంలోని మహాత్ముడి ఫొటోకు మాల వేసి నమస్కరించుకున్నారు. ఆశ్రమం లోపల కలియదిరిగే సమయంలో మోడీ ఆయనకు అప్పటి పరిస్థితులను వివరించారు. అప్పట్లో రాట్నాన్ని వాడి నూలు వడికేందుకు ప్రయత్నించారు. ట్రంప్ దంపతులిద్దరూ కాసేపు చెరఖాను తిప్పుతూ నూలు వడికారు. ఆ యంత్రం పనితీరును అడిగి వివరంగా దాని గురించి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆశ్రమం ప్రాంగణంలోని మూడు కోతుల బొమ్మను ట్రంప్ కు చూపిస్తూ ప్రధాని మోదీ దాని వెనకున్న కథను వివరించారు. గాంధీ మూడు కోతులుగా ప్రసిద్ధి చెందిన బొమ్మకు అర్థం... ‘‘చెడు వినవద్దు.. చెడు అనవద్దు.. చెడు కనవద్దు'' అని, మనుషులు జీవితాంతం సత్యాన్నే పాటిస్తూ, చెడుకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే గాంధీజీ ఆ కథను ప్రచారంలోకి తీసుకొచ్చారని ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. ట్రంప్‌‍కు నచ్చడంతో ఎక్కువ సేపు అడిగి తెలుసుకోవడంతో పాటు చాలా క్లియర్ గా పరిశీలించారు. ఆ తరువాత విజిటర్స్ బుక్ లో తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేసారు. దానికిందే ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా సంతకం చేశారు