Begin typing your search above and press return to search.

ఆ ఫోటో తో అభాసు పాలైన ట్రంప్ .. అందులో ఏముందంటే ?

By:  Tupaki Desk   |   24 Jan 2020 3:07 PM IST
ఆ ఫోటో తో అభాసు పాలైన ట్రంప్ .. అందులో ఏముందంటే ?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిత్యం వివాదాల తో సాహసం చేస్తుంటారు. ఈ మధ్య అయన అభిశంసన కి గురైన విషయం తెలిసిందే. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు దిగువ సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇకపోతే ట్రంప్ నిముషానికొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ అందరిని షాక్ కి గురిచేస్తుంటారు.

ఇకపోతే అసలు విషయం ఏమిటంటే .. ట్రంప్ శుక్రవారం ఉదయం పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేపుతోంది. ట్రంప్ పోస్ట్ చేసిన ఆ ఫోటోపై ట్విటర్‌ యూజర్లు ట్రంప్‌ ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ట్రంప్‌ చవకబారు వ్యక్తిత్వానికి ఈ పోస్ట్‌ సంకేతమని ట్రోల్‌ చేశారు. ఆలు ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఫోటోని ఒకసారి పరిశీలిస్తే మార్ఫింగ్‌ చేసిన ఆ ఇమేజ్‌లో ట్రంప్ ఒక గది హాలు మూలన నిలబడి, కిటికీ కి ఒక స్తంభం పై వాలగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాలీవుడ్ సినిమాల్లో ఉండే గూఢచారుల తరహాలో కిటికీ బయట నుంచి బైనాక్యులర్ల ద్వారా ట్రంప్ ని చూస్తున్నట్టుగా ఉంది. ఈ కిటికీ భూమికిపై నుండి కొన్ని అంతస్ధుల ఎత్తు లో ఉన్నట్టు కనిపిస్తోంది.

అయితే , ఈ ఫోటో చూడటానికి అద్భుతంగా ఉన్నప్పటికీ .. ఈ ఫోటోను ట్రంప్‌ పోస్ట్‌ చేసిన వెంటనే నెటిజన్లు తమదైన కామెంట్స్‌తో అమెరికా అధ్యక్షుడికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అభిశంసనకు గురయ్యే అధ్యక్షుడు ఎలా ఉంటారో ఒబామా చూడాలని అనుకుని ఉంటారని ఒకరు కామెంట్‌ చేయగా, మీరెంత అపహాస్యమైన ఉద్దేశాలతో ఉన్నారో మీకు అర్ధమైందా అని మరో యూజర్‌ ట్రంప్‌ కు గడ్డి పెట్టాడు .ఒబామా అంటే ట్రంప్‌కు ఎప్పుడూ అసూయేనని ట్రంప్ పై మరో నెటిజన్‌ మండి పడ్డారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ....ఈ పోస్ట్‌ ట్విటర్‌ లో కనిపించిన అరగంటలోనే 17,000 సార్లు రీట్వీట్‌ కావడం పెద్ద విశేషం.