Begin typing your search above and press return to search.
ఆ వ్యాక్సిన్ ప్రయోగంతో కోలుకున్న ట్రంప్..నేడు డిశ్చార్జ్
By: Tupaki Desk | 5 Oct 2020 9:30 AM ISTకరోనా బారినపడి వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉండటంతో సోమవారం ఉదయం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఆయనకు వైద్యులు ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న రెమ్‌డెసివిర్ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత కోలుకున్న ట్రంప్ తనకోసం వచ్చిన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆస్పత్రి ప్రాంగణంలో కాసేపు గడిపారు. కొద్ది రోజుల కిందట ట్రంప్ కు పాజిటివ్ తేలడంతో మేరీల్యాండ్‌లోని బేతెస్థలో ఉన్న మిలటరీ ఆసుపత్రిలో చేర్చి అత్యుతమ వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను ట్రంప్ కు ఇచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తొలి డోసు వేసిన తర్వాత ఆయనకు కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో అనంతరం రెండో డోసును కూడా వేసినట్లు వెల్లడించారు. రెండో డోసు ప్రభావంతో ట్రంప్ కిడ్నీలు, కాలేయం పని తీరు సాధారణ స్థితికి వచ్చిందని, ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని వైద్యులు చెప్పారు. ట్రంప్ శరీరంలో ప్రస్తుతం ఆక్సిజన్ స్థాయి 98 శాతంగా నమోదైనట్లుగా తెలిపారు.
కాగా ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ట్రంప్ ఆసుపత్రి ఆవరణలో తన కాన్వాయ్‌లో కాసేపు కలియదిరిగారు. తన కోసం వచ్చిన మద్దతుదారులకు కారులో నుంచే చేతులు ఊపుతూ, చప్పట్లు కొడుతూ హుషారుగా కనిపించారు. ఆయన దాదాపు 20 నిమిషాల పాటు ఆస్పత్రి ప్రాంగణంలో గడిపి అనంతరం లోపలికి వెళ్ళిపోయారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. డిశ్చార్జి తరువాత తీసుకోవాల్సిన జాగ్రతలపై ట్రంప్ కు తెలియజేసినట్లు వైద్యులు తెలిపారు. 'కరోనా సోకిన తర్వాత తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. వైరస్ గురించిన పూర్తి వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నా. మళ్లీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటానని' తన మద్దతు దారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.