Begin typing your search above and press return to search.
కరోనా చికిత్సకు వెళ్తూ ట్రంప్ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 3 Oct 2020 3:20 PM ISTఅగ్రరాజ్యపు అధినేత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుచుకున్న ట్రంప్ ఈ మధ్య విస్తృతంగా ప్రచారం చేయడంతో కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానికి ట్రంప్ రెడీ అయ్యారు.
కరోనా చికిత్సకు వెళుతూ ట్రంప్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. కరోనా నుంచి తాము త్వరగా కోలుకోవాలని అందరూ చూపిస్తున్నా అద్భుతమైన మద్దతుకు డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలియజేశారు.
తాను, తన భర్య ఫస్ట్ లేడి బాగానే ఉన్నామని భావిస్తున్నామని.. చికిత్స కోసం వాల్టర్ రీడ్ హాస్పిటల్ కు వెళ్తున్నామని ట్రంప్ వెల్లడించారు. తమ ఆరోగ్యం పట్ల అందరూ చూపిస్తున్న ఆకాంక్షను ఎప్పటికీ మర్చిపోనని ట్రంప్ తన ట్విట్టర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ట్రంప్ దంపతులు కోవిడ్ చికిత్స కోసం మేరిల్యాండ్ లోని బెథెస్టాలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ హాస్పిటల్ లో చేరారు. ప్రత్యేక హెలిక్యాప్టర్ లో భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రికి చేరుకున్నారు. ట్రంప్ ముఖానికి మాస్కుతోపాటు బిజినెస్ సూట్ ను ధరించారు. కరోనా తగ్గే వరకు ట్రంప్ మిలటరీ హాస్పిటల్ లోనే ఉండనున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. తగిన ఏర్పాట్లు చేశారు.
కాగా ట్రంప్ కరోనా చికిత్స కోసం 8 గ్రాముల డోసు గల పాలీక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ తీసుకున్నారు. దాంతోపాటు జింక్, విటమిన్ డి, పామోనిటిడైన్, ఆస్పిరిన్, మెలటోనిన్ తీసుకుంటున్నారు.