Begin typing your search above and press return to search.

ట్రంప్ మాట్లాడిన మాటలకు తలపట్టుకుంటున్న రిపబ్లిక్ పార్టీ ప్రతినిథులు

By:  Tupaki Desk   |   7 Sept 2020 11:30 AM IST
ట్రంప్ మాట్లాడిన మాటలకు తలపట్టుకుంటున్న రిపబ్లిక్ పార్టీ ప్రతినిథులు
X
డోనాల్డ్ ట్రంప్ .. అమెరికా అధినేతగా ఉన్న ట్రంప్ , మరోసారి అమెరికా అధ్యక్షుడి గా గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ లో అమెరికా లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ట్రంప్ అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే , కుక్క తోక .. ట్రంప్ నోరు ఒక్కటే. కుక్క తోక ఎన్నిసార్లు తాడుతో కట్టినా చక్కగా కాదు..ట్రంప్ కి కూడా ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మాత్రం మానలేదు. నిత్యం ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయనిదే ఆయనకి నిద్ర కూడా పట్టదు. అలాంటి వ్యాఖ్యలతో ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాడు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయడంతో , దాన్ని కవర్ చేయడానికి పార్టీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు.

తాజాగా ట్రంప్ .. అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన వివరాల ప్రకారం .. యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికులను ట్రంప్ లూజర్లుగా అభివర్ణించారు. అంతేగాదు ట్రంప్ తనను తాను సాయుధ దళాల ఛాంపియన్‌ గా చెప్పారు. సైన్యాన్ని బలోపేతం చేస్తానని చెప్పారు. ఏదేమైనా, అమర సైనికులను అవమానపరిచేలా లూజర్ అనే పదాన్ని ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ కూడా ట్రంప్‌ పై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'నా కుమారుడు బియు బిడెన్ కూడా ఇరాక్‌ లో ఉన్నాడు. అతను ఓడిపోలేదు. అతను బ్రెయిన్ క్యాన్సర్‌తో 2015 లో మరణించాడు. ఈ సమయంలో మీ కుమారుడు ఆఫ్ఘనిస్తాన్‌ లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది. మీరు ఒక కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్యను పోగొట్టుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది' అని అన్నారు. ట్రంప్ ప్రకటనను అవమానకరమైన, అన్-అమెరికన్ మరియు బాధ్యత లేనిదిగా బిడెన్ చెప్పాడు.

అయితే , ట్రంప్ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు రావడంతో నష్టా నివారణ చర్యలు చేపట్టారు. సైనికులను తానెప్పుడూ అవమానించలేదని అది నకిలీ ప్రకటన అని సైనికులు నిజమైన వీరులు అని తెలిపారు. ట్రంప్ పై ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధులు ట్రంప్ అలా మాట్లాడలేదు అని చెప్తున్నారు.