Begin typing your search above and press return to search.

భారత్ టెక్కీలకి చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ....?

By:  Tupaki Desk   |   7 Nov 2019 6:43 AM GMT
భారత్ టెక్కీలకి చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ....?
X
ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి వెళ్తే ఆ సమస్య తీరకపోగా మరో సమస్య తోడైనట్టు ఉంది ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారత్ టెక్కీలకి. ప్రతి ఒక్కరికి అమెరికా వెళ్లి జాబ్ చేయాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ని తీర్చుకోవడానికి కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. అలా అవకాశం వచ్చిన వారు ఏడు సముద్రాలు దాటుకొని .. నిత్యం ఉరుకులు , పరుగుల మీద జీవితంతో పోరాడుతుంటారు. జాబ్ తోనే అక్కడ పెద్ద సమస్య అంటుకుంటే ..ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారతీయ టెక్కీలకి చుక్కలు చూపిస్తున్నాడు.

ట్రంప్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించగానే .. ముందు అమెరికన్ తరువాతనే ఇతరులు అనే నినాదాన్ని తీసుకువచ్చారు. ఈ విధానంతో భారతీయ సాంకేతిక నిపుణులు, భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ వీసాలు (హెచ్ 1 బి) విషయంలో అమెరికాకు చెందిన పౌరసత్వ, వలస విధానం సేవల విభాగం యుఎస్‌సిఐఎస్ ట్రంప్ ఉత్తర్వుల మేరకు నిబంధనలను కఠినతరం చేసింది. దీనితో ట్రంప్ దేశాధ్యక్షుడు అయిన తరువాత అత్యధిక సంఖ్య లో ఈ హెచ్ 1 బి వీసాల దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతూ వస్తున్నాయి.

తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులలో అత్యధికం భారతీయ కంపెనీల వారివే కావడంతో అమెరికాలో ఉద్యోగం చేయాలనీ ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. భారతీయ ఐటి యువత హెచ్ 1 బి వీసాను ప్రాణప్రదంగా భావిస్తూ ఉంటారు. అమెరికాలో అత్యున్నత స్థాయి అవకాశాలకు దీనిని మించింది లేదని ఈ వీసా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం వారి సమాచారం ప్రకారం..భారతీయులకు ఈ హెచ్ 1 బి వీసాల తిరస్కరణ 2015లో ఆరు శాతం ఉండగా అది ఇప్పుడు ఆరింతలు పెరి 24 శాతానికి చేరింది.

2015లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, గూగుల్ కంపెనీల హెచ్ 1 బివీసాల దరఖాస్తుల తిరస్కరణ కేవలం 1 శాతంగా ఉండేది. అయితే ఇప్పుడు 2019లో ఇది ఆయా కంపెనీలకు వరుసగా చూస్తే అమెజాన్‌కు 6 శాతం, మైక్రోసాఫ్ట్‌కు 8 శాతం, ఇంటెల్‌కు 7 శాతం, గూగుల్‌కు 3 శాతంగా నమోదైంది. దీనికి ప్రధాన కారణం ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్తున్నారు.