Begin typing your search above and press return to search.

స్తంభించిన అమెరికా ప్రభుత్వం

By:  Tupaki Desk   |   22 Dec 2018 8:30 AM GMT
స్తంభించిన అమెరికా ప్రభుత్వం
X
అమెరికా ప్రభుత్వ ఖజానా మరోసారి స్తంభించింది. ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. పరాయిదేశం వాళ్లను అమెరికా కు రానీయకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందిస్తున్న ట్రంప్ వైఖరికి నిరసనగా డెమోక్రాట్లు ఏకమయ్యారు. దీంతో ప్రభుత్వాన్నే స్తంభింపచేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

అమెరికాలోకి వలసలు నిరోధించే చర్యల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల నిధులను కలిపి ఫెడరల్ బిల్లును ప్రవేశపెట్టారు ట్రంప్. కానీ ఈ బిల్లుకు ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును వారు వ్యతిరేకించడంతో ఈ ద్రవ్య బిల్లు పాస్ కాలేదు. దీంతో ప్రభుత్వం స్తంభించింది. పలు ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలను, పార్కులను మూసివేశారు.

శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో ఏ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. వారంతా వేతనం లేకుండా పనిచేయాల్సి రావచ్చని తెలిసింది. ప్రభుత్వం స్తంభించిందనే విషయాన్ని ట్రంప్ కూడా నిర్ధారించారు. అయితే ఇది తాత్కాలికమేనని.. ముందడుగు వేస్తామని ట్రంప్ ప్రకటించారు.