Begin typing your search above and press return to search.

కమలా హారిస్ కంటే నా కూతురే బెటర్ : ట్రంప్ !

By:  Tupaki Desk   |   29 Aug 2020 1:30 PM GMT
కమలా హారిస్ కంటే నా కూతురే బెటర్ : ట్రంప్ !
X
అమెరికా ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుంది. నవంబర్ లో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి సత్తా చాటాలని ట్రంప్ అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కన్నా తన కూతురు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంపే బెటరని తన కూతురుని వెనకేసుకొని వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. న్యూ హాంప్ షైర్ లో జరిగిన రిపబ్లికన్ కాంపెయిన్ ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. అమెరికా అధినేతగా మహిళా అభ్యర్థి అయితేనే మంచిదని, ఈ దేశానికి ఓ మహిళను అధ్యక్షురారాలిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు.

ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్, అధ్యక్ష పదవికి కమలా హారిస్ సమర్థురాలు కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ పదవికి తన కూతురు ఇవాంక ట్రంప్‌ సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. గత ఏడాది వరకు అధ్యక్ష పదవికి అభ్యర్థి రేసులో కమలా హారిస్ ఉన్నారు. అయితే తగినంతమంది ఓటర్ల మద్దతు లేకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యపదవికి ఆమె డెమొక్రాట్ అభ్యర్థిగా ఉన్నారు. ఏమైనా. ఈ దేశాధ్యక్ష పదవికి మహిళగా హారిస్ మాత్రం తగరని, ఆమె పాపులారిటీ క్రమేపీ తగ్గుతూ వచ్చిందని ట్రంప్ అన్నారు.

కాగా.. కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. ట్రంప్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తమ అభ్యర్థిగా కమలా హారిస్‌ను ప్రకటిస్తుందనే ఉహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన ట్రంప్.. అధ్యక్ష పదవికి కమలా హారిస్ సమర్థురాలు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ట్రంప్ విధానాలు అమెరికన్లకు హానికరంగా పరిణమించాయని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కమలా హారిస్ నిప్పులు కక్కారు. అమెరికా నూతన అధ్యక్షునిగా జో బిడెన్ ప్రజల ఆశయాలను తీర్చగలరని ఆమె చెప్తున్నారు.