Begin typing your search above and press return to search.
కరోనా సూపర్ స్ప్రెడర్ గా ట్రంప్ ర్యాలీలు !
By: Tupaki Desk | 2 Nov 2020 2:20 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ పోటీపడుతున్నారు. కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచే దెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఈ సమయంలో కామెంట్లు, విమర్శలతో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ హీట్ ఎక్కిస్తున్నారు. దీన్ని పక్కనబెడితే.. ట్రంప్ ఎన్నికల ప్రచారంతో 30 వేల మంది కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాన్ ఫోర్డ్ వెల్లడించిన సర్వే ఫలితాలను బైడెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ట్రంప్ ప్రచార ర్యాలీల కారణంగా అమెరికాలో మూడు వారాల్లోనే 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయని బైడెన్ ఆరోపించారు.
జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా కరోనా సోకిందని, వారిలో 700 మంది చనిపోయారని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ప్రజలు వ్యాధుల రూపంలో, మరణాల రూపంలో తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. ‘ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 : ద కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్’ పేరుతో స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దీనిపై ‘ట్రంప్ మీ గురించి పట్టించుకోడు. తన సొంత మద్దతుదారులనూ పట్టించుకోడు’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ అధ్యయనంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. దీని ఫలితంగా వేల మందికి కరోనా సోకిందని తెలిపారు. ట్రంప్ ర్యాలీలు కరోనా సూపర్ స్ప్రెడర్ గా మారాయని, కరోనా నియంత్రణ చర్యలను ఇవి తీవ్రంగా దెబ్బతీశాయని సర్వే పేర్కొంది.