Begin typing your search above and press return to search.
మోడీ గొప్ప నాయకుడంటూ ప్రశంసలు కురిపించిన ట్రంప్ !
By: Tupaki Desk | 5 Sept 2020 11:15 AM ISTఅమెరికాలో వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి సత్తా చాటి అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ భాద్యతలు చేపట్టాలని ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే , మళ్లీ ఎన్నికల్లో గెలవడం అనుకున్నంత ఆషామాషీ కాదు అని తెలిసిన ట్రంప్ అమెరికన్ భారతీయుల్ని ఆకట్టుకునే పనిలో పడ్డాడు. భారత్ పై , భారత ప్రధాని మోడీ పై ప్రశంసలు కురిపిస్తూ భారతీయుల పూర్తి మద్దతు తనకే ఉందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.
తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పై అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై ట్రంప్ ప్రశంసల జల్లులు కురిపించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ కచ్చితంగా తనకే ఓటు వేస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ నుంచి మాకు విశేషమైన మద్దతు ఉందని , తాము ప్రధాని మోడీకి గట్టి మద్దతుదారులుగా నిలుస్తున్నామని తెలిపారు. అలాగే , హోస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమంగా అద్భుతంగా జరిగిందని, ఈ కార్యక్రమానికి నేను ప్రధాని మోడీని ఆహ్వానించానని అన్నారు. అదో అతుల్యమైన కార్యక్రమం.... భారత దేశం నుంచి మాకు గొప్ప మద్దతు ఉందన్నారు. మోడీ నుంచి కూడా గొప్ప మద్దతు ఉందని... భారతీయులకు మంచి నాయకుడు దొరికాడని ట్రంప్ ప్రశంసలు కురిపించాడు. కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చక ముందే భారత్ లో పర్యటించానని, కరోనా కారణంగా భారత్ చాలా దెబ్బతిందని ఆయన తెలిపారు. భారత ప్రజలు చాలా గొప్ప వారని, దేశం కూడా చాలా గొప్ప దేశమని ట్రంప్ ప్రశంసించారు. అలాగే మళ్లీ అధ్యక్షుడిగా గెలిస్తే భారత్ తో సాన్నిహిత్యం మరింత పెరిగేలా చూస్తానని తెలిపారు.