Begin typing your search above and press return to search.

ట్రంప్ అధికారిక వెబ్ ‌సైట్‌ హ్యాక్ .. పోలింగ్ ముందు భారీ షాక్ , నిర్దారించిన టిమ్ ముర్టా .

By:  Tupaki Desk   |   28 Oct 2020 4:40 PM IST
ట్రంప్ అధికారిక వెబ్ ‌సైట్‌ హ్యాక్ .. పోలింగ్ ముందు భారీ షాక్ , నిర్దారించిన టిమ్ ముర్టా .
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్‌ కి పోలింగ్ కి మరికొద్దిరోజులే సమయం ఉన్న సమయంలో భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఎన్నికల ప్రచార అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. అందులో డొనాల్డ్ ట్రంప్ ‌పై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, ఫొటోలు, వీడియోలు, డిబేట్లకు సంబంధించిన సమాచారాన్ని ఆ వెబ్ సైట్ లో పొందుపరిచేవారు. దీనితో ఆ వెబ్ సైట్ హ్యాక్ కావడం రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులని నివ్వెరపరుస్తోంది. గాబ్రియెల్ లొరెన్జో గ్రెష్లర్ అనే ఓ ట్విట్టరెట్.. దాన్ని మొదటగా గుర్తించారు. వెబ్‌సైట్ స్క్రీన్‌షాట్‌ను తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి తాను ఈ వెబ్‌ సైట్‌ ను సందర్శించానని, అందులో ఉన్న సమాచారం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ది సైట్ వాజ్ సీజ్డ్ అనే అక్షరాలు తనకు కనిపించాయని, దానికింద పొందుపరిచిన వివరాలను డొనాల్డ్ ట్రంప్‌ కు వ్యతిరేకంగా ఉన్నాయని గాబ్రియెల్ పేర్కొన్నారు. దీనితో ఆ వెబ్ ‌సైట్ హ్యాక్‌ కు గురైందనే నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ వెబ్‌సైట్‌ ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్లు ప్రకటించారు. కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చెందడంలో డొనాల్డ్ ట్రంప్‌ కు ప్రమేయం ఉందని, దానికి తగిన సాక్ష్యాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు. కీలకమైన, సున్నిత అంశాలు ఈ వెబ్‌సైట్ ద్వారా ట్రంప్ కుటుంబ సభ్యులకు చేరుతున్నాయని, అధ్యక్ష పదవికి ట్రంప్ ఏ మాత్రం తగని వ్యక్తి అని విమర్శించారు. ఆయనకు అనేక నేరాలతో ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ట్రంప్.. విదేశీ నటులతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు

ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు దాన్ని ఆఫ్‌ లైన్‌ లో ఉంచారు. సుమారు 30 నిమిషాల పాటు ఈ వెబ్‌ సైట్‌ ను ఆఫ్‌ లైన్ ‌లో ఉంచారు. అనంతరం దాన్ని పునరుద్ధరించారు. ఈ వెబ్ ‌సైట్ హ్యాక్ కి గురైందనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార విభాగం అధికార ప్రతినిధి టిమ్ ముర్టా నిర్ధారించారు. వెబ్‌ సైట్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని, అందులో తప్పుడు సమాచారాన్ని పబ్లిష్ చేశారని అన్నారు. ఎక్కరు ఎక్కడి నుంచి హ్యాక్ చేశారనే విషయాన్ని ట్రాక్ చేస్తున్నట్లు తెలిపారు.