Begin typing your search above and press return to search.

మరొక బాంబ్ పేల్చిన ట్రంప్

By:  Tupaki Desk   |   5 Oct 2019 12:01 PM GMT
మరొక బాంబ్ పేల్చిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడు ఏ చట్టం తీసుకొస్తాడో ఎవరికీ తెలీదు. ఆయన తీసుకునే నిర్ణయాలతో ఆ దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా అయోమయానికి గురౌతున్నాయి. ఎప్పుడు ఏ దేశం మీద ప్రేమ కురిపిస్తాడో, ఏ దేశం మీద ద్వేషంతో రగిలిపోతాడో ఆయనకే తెలీదు. ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాక తీసుకొచ్చిన పాలసీలు కొన్ని దేశాలకు కొరకరాని కొయ్యగా మారాయి. ఈయన తీసుకునే నిర్ణయాలు వేరే దేశాల నుండి అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళకి తల నొప్పిగా మారాయి.

ఇప్పుడు తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్లకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వైద్య ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత లేని వాళ్ళు అమెరికా రావద్దంటూ కొత్త ఉత్తర్వులు తీసుకొచ్చింది అమెరికా. అలా వచ్చిన వాళ్ళ వల్ల అమెరికా వ్యవస్థల మీద ఒత్తిడి పెరుగుతుందని అందుకే ఈ పాలసీ తీసుకురావాల్సి వచ్చిందన్నారు. అమెరికాలో ప్రవేశించిన 30 రోజుల లోపే ఆరోగ్య భీమా తీసుకోవాలని, లేకపోతె అమెరికాలో ప్రవేశార్హత కోల్పోతారని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ నిబంధన నుండి శరణార్ధులను మాత్రం మినహాయించింది.