Begin typing your search above and press return to search.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కీలక ట్వీట్ !
By: Tupaki Desk | 31 July 2020 1:20 PM ISTఈ సంవత్సరం నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, ప్రజలు బయటకి వచ్చి దైర్యంగా ఓట్లు వేయలేరని, పోస్టల్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగే వరకు ఎన్నికలు ఆలస్యం??? అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. పోస్టల్ ఓటింగ్ పెరిగితే మోసపూరితమైన, తప్పుడు ఫలితాలు వస్తాయని అన్నారు.
మెయిల్-ఇన ఓటింగ్ వల్ల ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉందని , ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఎన్నికలకి ఈ సమయం మంచిది కాదు అని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ ఓటింగ్‌ను నిర్వహించాలని అమెరికన్ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికలు వాయిదా వేయాలని ట్రంప్ ఎంతగా నిర్ణయించుకున్నప్పటికీ, ఎన్నికలు వాయిదా వేయాలంటే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీల గురించి ఆ దేశ రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. అయినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తుండటంతో ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో అధినేత ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు పలు చర్చలకు దారితీస్తుంది.