Begin typing your search above and press return to search.

ఏప్రిల్ నాటికీ ప్రతి ఒక్క అమెరికన్ కి వ్యాక్సిన్ : ట్రంప్

By:  Tupaki Desk   |   19 Sep 2020 8:30 AM GMT
ఏప్రిల్ నాటికీ ప్రతి ఒక్క అమెరికన్ కి వ్యాక్సిన్ : ట్రంప్
X
కరోనా మహమ్మారి అమెరికాని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దాదాపుగా 70 లక్షల మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక వ్యాక్సిన్ రాకపోవడంతోనే కేసులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. అయితే, వ్యాక్సిన్ గురించి మరోసారి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. తమ దేశంలోని ప్రతీ పౌరునికి మరో 7 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇది అమెరికా వాసులకి శుభవార్తే అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రతీ పౌరుడికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

కరోనా విజృంభించడం వల్ల నెల నెల మిలియన్ల కొద్దీ డోసులు అవసరవుతాయని తెలిపారు. అయితే, ఏప్రిల్ వరకు మాత్రం పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఉంటుందని, కొరత ఉండబోదు అని చెప్పారు. అన్నీ నిర్దారణ పరీక్షలు చేసి.. సేఫ్ అని ఫేడరల్ హెల్త్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపిన 24 గంటల్లో వ్యాక్సిన్ మార్కెట్‌ లో వస్తుందని వెల్లడించారు. కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. త్వరలోనే తాము వైరస్‌ను జయిస్తామని తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అక్టోబర్ వరకు వస్తుందని ఇదివరకు ట్రంప్ చెప్పారు. కానీ, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తోందనే అంశంపై నిపుణులు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నందున.. సమయం చెప్పడం లేదు. కానీ, ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ‌ను తరిమికొడతామని ట్రంప్, నిపుణులు చెబుతున్నారు.