Begin typing your search above and press return to search.

విదేశీ విద్యార్థులకు కలలో కూడా ఊహించని షాకిచ్చిన ట్రంప్ సర్కార్

By:  Tupaki Desk   |   7 July 2020 5:15 AM GMT
విదేశీ విద్యార్థులకు కలలో కూడా ఊహించని షాకిచ్చిన ట్రంప్ సర్కార్
X
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థంకానట్లుగా వ్యవహరించే ఆయన.. ఈ మధ్యనే ఉద్యోగ అవసరాలకు వచ్చే విదేశీయులపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఆయన కొరడా ఝుళిపించారు. మహమ్మారి నేపథ్యంలో పూర్తిస్థాయి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు వీలుగా విద్యాసంస్థలు మొగ్గు చూపుతున్న వేళ.. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. అమెరికాలో చదవాలనుకునే కొత్త విద్యార్థులకురానున్న రోజుల్లో వీసాలు జారీ చేయమని చెప్పటం షాకింగ్ గా మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ క్లాసులు బోధించేలా విద్యాసంస్థలు నిర్ణయం తీసుకుంటే.. విదేశీ విద్యార్థులకు వీసాలు జారీ చేయమని చెబుతుండటం గమనార్హం.

అంతేకాదు..ప్రస్తుతం అమెరికాలో ఉండి ఆన్ లైన్ క్లాసులు వింటున్న వారు సైతం దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అమెరికాలో ఉండాలనుకునే విద్యార్తులు తప్పనిసరిగా స్కూలుకు తప్పనిసరిగా వెళ్లే అనుమతి ఉన్న విద్యా సంస్థలకు తమ ఆడ్మిషన్ ను బదిలీ చేసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ.. అలా చేయని పక్షంలో ఇమ్మిగ్రేషన్ విధానానికి ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా అమెరికాలో చదవాలనుకునే వారికి సైతం తన మార్కు విధానాలతో ట్రంప్ సర్కారు షాకిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.