Begin typing your search above and press return to search.

ట్రంప్ వెళ్లిపో.. వెళ్లనంటూ మారం.. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   9 Nov 2020 3:40 PM IST
ట్రంప్ వెళ్లిపో.. వెళ్లనంటూ మారం.. వీడియో వైరల్
X
పులిలా ఇన్నాళ్లు బతికిన అమెరికా అధ్యక్షుడిని అక్కడి ప్రజలు ఓడించి పిల్లిలా మార్చేశారు. అధికారం కోల్పోవడంతో ట్రంప్ కు అవమానాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే టుస్సాడ్ మ్యూజియం నుంచి ట్రంప్ మైనపు బొమ్మలను తీసేసి చెత్తబుట్టలో వేశారట.. ఇక ఇన్నాళ్లు అధికార బలంతో రెచ్చిపోయిన ట్రంప్ ను నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ , ట్రోల్స్ తో తెగ ఏకిపారేస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖరారు కావడంతో ఇక ఆయనపై నెటిజన్లు పడ్డారు. ఇటీవల ట్రంప్ తుది ఫలితాలకు ముందే రిగ్గింగ్, మోసాలకు పాల్పడ్డారంటూ డెమోక్రాట్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటమిని తట్టుకోలేక చిన్నపిల్లాడిలా చాడీలు చెబుతున్నాడని డెమోక్రాట్స్ సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ ఓటమి ఖరారు కావడంతో గోల్ఫ్ క్లబ్ కి వెళ్లి గోల్ ఆడుతూ సేదతీరాడు.

ట్రంప్ తీరు చూస్తుంటే అమెరికా అధ్యక్ష భవనం వదిలేలా కనిపించడం లేదని.. వైట్ హౌస్ వీడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్రంప్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఈ మేరకు ఓ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. ‘హాలో ట్రంప్ నీ టైం ముగిసింది.. ఇక వైట్ హౌస్ వీడి వెళ్లిపో.. అంటే నో నేను వెళ్లను ఇక్కడే ఉంటానంటూ ట్రంప్ మారం చేస్తున్నట్టుగా ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు. జిమ్ పికార్డ్ అనే ట్విట్టర్ యూజర్ చేసిన ట్రంప్ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ దానిపై ఓ లుక్కేయండి..