Begin typing your search above and press return to search.
బైడెన్ కు ఫోన్ చేసిన ట్రంప్ జిగిరీ దోస్త్
By: Tupaki Desk | 18 Nov 2020 1:00 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడై రోజులు గడుస్తోంది. ఇప్పటికే పలువురు దేశాధినేతలు ఆయనకు ఫోన్ చేయటం.. అభినందనలు తెలపటం లాంటివి చేశారు. మరికొందరు మౌనంగా ఉంటే.. ఇంకొందరు టైం చూసుకొని చేద్దామన్నట్లుగా ఉండిపోయారు. అలాంటి వారిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. భారత్ - అమెరికాల మధ్య అనుబంధం బలంగా ఉండటం తెలిసిందే.
గతంతో పోలిస్తే.. మోడీ -ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడటమే కాదు.. గతంలో ఎప్పుడూ లేనంత చిక్కదనం రెండు దేశాల మధ్య నెలకొందని చెబుతారు. వ్యక్తిగతంగా కూడా మోడీ- ట్రంప్ ఇద్దరు సన్నిహితంగా ఉండటం తెలిసిందే. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగిన ట్రంప్ నకు అనుకూలంగా ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లి మరీ ప్రచారం చేసిన వైనం అప్పట్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావాలన్న భావన మోడీ దాచుకోలేదు. అయితే.. తాజా ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ గెలుపొందటంతో మోడీ మాస్టారు తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే.. గెలుపు ఖరారైందన్న వార్తల్ని చూసిన మోడీ.. అధ్యక్షుడు బైడెన్ కు.. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారీస్ కు అభినందనలు తెలియజేశారు.
తాజాగా ఆయన బైడెన్ కు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. మొన్నటికి మొన్న బైడెన్ తో త్వరలో ప్రధాని మోడీ భేటీ జరుపుతారన్న వార్తలు వస్తున్న వేళ.. అంతకు ముందే.. ఆయన బైడెన్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య గతంలో మాదిరి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ విషయాల్ని మోడీ ట్వీట్ తో వెల్లడించారు. బైడెన్ తో పాటు.. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారీస్ తోనూ ఫోన్లో మాట్లాడారు. ఇరువురికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు.. ఎన్నికల్లో తాను గెలిచానని.. బైడెన్ రిగ్గింగ్ చేశారన్న ఆరోపణలు చేస్తూ న్యాయపోరాటానికి దిగిన వైనం తెలిసిందే. అయినప్పటికీ పలు దేశాధినేతలు బైడెన్ కు ఫోన్లు చేస్తూ టచ్ లోకి వెళుతున్నారు.
తాజాగా మోడీ అదే బాటలో నడిచారు. కాకుంటే.. ఇంత ఆలస్యం చేయకుండా ముందే ఫోన్ చేసి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ట్రంప్ కు జిగిరీ దోస్త్ అయిన మోడీ సైతం బైడెన్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పటం.. ఇరు దేశాల సంబంధాల గురించి మాట్లాడటం చూసిన తర్వాత.. తాజా ఫోన్ కాల్ ట్రంప్ నకు ఇబ్బంది కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.