Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘర్షణలు :మద్దతుదారులకు మద్దతుగా నిలిచిన ట్రంప్!

By:  Tupaki Desk   |   1 Sept 2020 12:00 PM IST
అమెరికాలో ఘర్షణలు :మద్దతుదారులకు మద్దతుగా నిలిచిన ట్రంప్!
X
అమెరికా ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతుంది. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి వైట్ హౌస్ లో కూర్చోవాలని ట్రంప్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ కోసం పోరాటం పేరుతొ ఎన్నికల బరిలో దిగారు, మరోవైపు ప్రత్యర్థి పార్టీ కూడా ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉంది. ఇక సర్వేలన్నీ కూడా ట్రంప్ కి కొంచెం వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. ఇక ఈ ఎన్నికల ,సమయంలోనే .. అమెరికాలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరిగే అల్లర్లకు ట్రంప్ మద్దతుదారులకు సంబంధం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న ఘర్షణల్లో పాత్ర ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మద్దతుదారులను వెనకేసుకొచ్చారు ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్.

గతవారం ఇద్దరిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీనేజర్, శనివారం ఆరెగాన్ ఘర్షణల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన మద్దతుదారులు అంతా ఆత్మరక్షణలో భాగంగానే అలా చేస్తున్నారని అధినేత ట్రంప్ అన్నారు.నా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉండడం నిజమే. కానీ, వారిది శాంతియుత ప్రదర్శన. ఆత్మరక్షణలో భాగంగా పెయింట్ పెల్లెట్స్ కాల్చారు. నిజమైన బుల్లెట్లు కావు అని సందర్భంలో వివరించారు. అయితే, ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నామన్నారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, తన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్ ప్రస్తుత పౌర ఘర్షణలకు కారణమని ఆరోపణలున్న అతివాద వామపక్ష యాక్టివిస్టుల ఊసెత్తడంలేదని ట్రంప్ విమర్శించారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్‌లో ట్రంప్ కంటే జో బైడెన్ ముందున్నారు.