Begin typing your search above and press return to search.

ట్రంప్ కు ఇది ఘోర అవమానం?

By:  Tupaki Desk   |   27 Jan 2021 8:00 PM IST
ట్రంప్ కు ఇది ఘోర అవమానం?
X
అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడు 'మోనార్క్'లా ప్రవర్తించి అమెరికా పరువు తీసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దిగిపోయాక తన సొంత రాష్ట్రం ఫ్లోరిడా వెళ్లిపోయి హాయి గోల్ఫ్ ఆడుకుంటూ తన ప్యాలెస్ లో సేదతీరుతున్నాడు. అయితే ట్రంప్ చేసిన పనులను మాత్రం ఎవరూ మరిచిపోవడం లేదు. ఏకంగా తన పార్టీ కార్యకర్తలతో అమెరికన్ పార్లమెంట్ పైనే దాడి చేయించిన ట్రంప్ ను ఇప్పుడు ఆయన వ్యతిరేకులు ఓ ఆట ఆడుకుంటున్నారు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం ఎదురైంది. ట్రంప్ ప్రస్తుత నివాసం సమీపంలో కొన్ని బ్యానర్లతో కూడిన విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన ట్రంప్ 20న తన భార్య మెలానియాతో కలిసి ఫ్టోరిడాలోని నివాసానికి వచ్చేశారు. అక్కడే సేద తీరుతున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ట్రంప్ నివాసానికి దగ్గరగా ఉన్న పామ్ బీచ్ సమీపంలో 'ట్రంప్ ఎప్పుడూ చెత్త ప్రెసిడెంటే' అనే బ్యానర్ గల ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీంతోపాటు 'ట్రంప్ నువ్వు ఘెరంగా ఓడిపోయావ్.. తిరిగి మాస్కోకు వెళ్లిపో' అనే బ్యానర్ కూడా ఆకాశంలో కనిపించింది.ఈ దృశ్యాలను కొందరు వీడియోల తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ట్రంప్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోతోంది. ఇది ఎవరు చేశారన్నది ఇప్పటివరకు తేలలేదు.