Begin typing your search above and press return to search.
హత విధి.. ట్రంప్ కేంటి ఈ గతి..
By: Tupaki Desk | 8 Nov 2020 4:00 PM ISTఎంతవారలైనా విజయం వెంటున్నంత కాలమే చుట్టూ ఉన్న జనం విలువ ఇచ్చేది. ఒక్కసారి పరాజయాల బాట పడితే ఎప్పుడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన అనుకున్న వాళ్లు మన కోసం ప్రాణం ఇస్తారని అనుకునే వాళ్లు కూడా ఒక్కోసారి తేడా చూపిస్తుంటారు. వెనకాల నిలబడి అంత దాకా జేజేలు పలికిన జనం ఓటమి ఎదురైతే ముఖం కూడా చూపరు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. మొన్నటి వరకు అమెరికా అధ్యక్ష హోదాలో రాజభోగాలు అనుభవించిన ట్రంప్..జేజేలు కొట్టించుకున్న వ్యక్తి ఇప్పుడు ఇంకా పదవి నుండి దిగకముందే.. తాజా ఎన్నికల్లో ఓడిపోయినందుకు భరించలేని అవమానాలకు గురవుతున్నాడు.
ఇప్పటికే సోషల్ మీడియాలో అతడి వ్యతిరేకులు ట్రంప్ పై జోకులు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ట్రంప్ ఓడినా వైట్ హౌస్ ఖాళీ చేయనంటూ.. మొండి కేస్తాడేమో అని ఒకరు, శ్వేత సౌధం నుంచి తరిమేస్తామని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతడి పనైపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ట్రంప్ కి పెద్ద షాకే ఇచ్చింది. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడని తెలియగానే జర్మనీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉన్న ట్రంప్ మైనపు విగ్రహాన్ని తీసేసి చెత్తబుట్టలో పడేసింది. ఇదే బాటలో లండన్ టుస్సాడ్స్ మ్యూజియం కూడా చేరింది. అక్కడ ఉన్న ట్రంప్ మైనపు విగ్రహానికి డ్రెస్ మార్చేశారు. సూటు బూటు ధరించి ఉన్న విగ్రహాన్ని మార్చి గోల్ఫ్ ఆడేందుకు రెడీ అయిన ట్రంప్ వేషంలో కొత్తగా డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పవర్ ఉన్నప్పుడు జనం ఒకలా ప్రవర్తిస్తారని, లేకపోతే మరో విధంగా ప్రవర్తిస్తారని, ఇందుకు ట్రంప్ జీవితం మరో ఉదాహరణ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.