Begin typing your search above and press return to search.
ముమ్మాటికి.. కరోనా కాదు చైనీస్ వైరస్సే
By: Tupaki Desk | 18 March 2020 2:30 PM ISTఊరంతా తగలబడిపోతుంటే.. ఆ మంటతో చుట్ట వెలిగించుకుంటే ఎలా ఉంటుంది? ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడి తీరు ఇప్పుడు ఇలానే ఉంది. తనను తరచూ ఇబ్బంది పెట్టే చైనాను టైం చూసి దెబ్బ తీసేందుకు ఆయన ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం.. పెంకితనం ఇప్పుడు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారుతోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ను.. కొద్దికాలంగా చైనీస్ వైరస్ గా అభివర్ణించటం.. దీనిపై డ్రాగన్ దేశం అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇప్పటికే కరోనాను చైనీస్ వైరస్ గా ట్రంప్ పేర్కొన్న అంశంపై మాటల యుద్ధం సాగుతోంది. దీనికి కొనసాగింపుగా.. తాజాగా ఆయన కరోనాను చైనీస్ వైరస్ గా అభివర్ణించటం తప్పేమీ కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటమే కాదు.. తాను చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన సమర్థించే ప్రయత్నం చేయటం గమనార్హం.
ఆ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో.. దాని పేరు పెట్టి పిలవటం తప్పేమీ కాదన్న ఆయన.. చైనీస్ వైరస్ అనే పదం సరైనదేనని పేర్కొన్నారు. చైనాకు ప్రయాణాల్ని నిషేధించి తాను మంచి పని చేసినట్లుగా పేర్కొన్నారు. చైనాతో విభేదాల కారణంగా ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల దిగుమతుత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ఆయన కొట్టి పారేస్తున్నారు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా మరణించిన చైనీయులతో పోలిస్తే.. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసిన రోజునే.. ట్రంప్ నోటి నుంచి కరోనాను తాను ముమ్మాటికి చైనీస్ వైరస్ గానే పిలుస్తానని పేర్కొనటం గమనార్హం. ట్రంప్ మాష్టారి తీరు చూస్తే.. మన కేసీఆర్ కనుక అప్పుడప్పడు బాజాప్తా.. నేను అలానే అంటా.. ఏం చేస్తారు? అని ప్రశ్నించినట్లు అనిపించట్లేదు?