Begin typing your search above and press return to search.

అమెరికా వీసాలపై తాత్కాలిక బ్యాన్?

By:  Tupaki Desk   |   10 May 2020 3:10 AM GMT
అమెరికా వీసాలపై తాత్కాలిక బ్యాన్?
X
గడిచిన కొద్దిరోజులుగాచోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోనుందా. అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల వీసాల్ని తాత్కాలికంగా బ్యాన్ విధించనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఈ అంశంపై అమెరికన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా ఉద్యోగ రంగంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటివేళ.. ఇతర దేశాలకు చెందిన వారికి అవకాశాలు ఇచ్చే కన్నా.. అమెరికాలో ఉన్న వారికే అవకాశాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో ట్రంప్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. సాంకేతిక.. ఇతర నైపుణ్యాలున్న విదేశీయులకు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే అన్నిరకాల వీసాలపై తాత్కాలికంగా నిషేధాన్ని అమలు చేయాలన్న యోచనలో ఉన్నారు.

అమెరికా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాన్ని కల్పించే హెచ్ 1బీ వీసాకు భారత్.. చైనాలలో ఉన్న డిమాండ్ ఎంతో అందరికి తెలిసిందే. ఈ వీసా మీద ప్రస్తుతం అమెరికాలో దగ్గర దగ్గర ఐదు లక్షల మంది విదేశీయులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. వర్క్ వీసాలపై విధించే బ్యాన్ కు సంబంధించిన అధికారిక ఉత్తర్వుల్ని ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితి నేపథ్యంలో 40 వేల మంది విదేశీ వైద్యులు..నర్సులకు గ్రీన్ కార్డులు జారీ చేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ లో బిల్లును ప్రవేశ పెట్టారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోదం పలికే అవకాశం ఉందంటున్నారు.