Begin typing your search above and press return to search.

హెచ్‌1బీ వీసా..భాగస్వామ్యుల కోసం ట్రంప్‌ కు మొర‌

By:  Tupaki Desk   |   16 March 2018 11:30 PM GMT
హెచ్‌1బీ వీసా..భాగస్వామ్యుల కోసం ట్రంప్‌ కు మొర‌
X
హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు తాత్కాలిక ఊరట లభించే అవ‌కాశం ద‌క్కింది. అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించొద్దని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఆరుగురు శాసనకర్తలు ట్రంప్‌ యంత్రాంగాన్ని కోరారు. జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ హెచ్‌-4 వీసా‌తో ఎక్కువగా భారతీయులు లాభపడుతున్నారు. 2015 నుంచి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల (భార్య లేదా భర్త)కు హెచ్4 ఆధారిత వీసాలపై అమెరికాలో పని చేసుకునేందుకు గత ఒబామా ప్రభుత్వం అర్హత కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ట్రంప్ సర్కారు.. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఆయ‌న్ను భాగ‌స్వామ్యం క‌లిశారు.

2015లో ఒబామా దీనిని ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు 1,04,000 మందికి హెచ్‌-4 వీసా ద్వారా పని అనుమతి పొందినట్లు సమాచారం. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములకు కూడా అమెరికాలో వర్క్‌ పర్మిట్‌ కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించి నిబంధనలు అలాగే ఉంచాలని సిలికాన్‌ వ్యాలీకి చెందిన డెమోక్రాట్‌ నేతలు కోరినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. హెచ్‌-4 వీసాను రద్దు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన చాలా మంది ప్రతిభావంతులైన ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితిలో పడుతుందని, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని వెల్లడించారు. సిలికాన్‌ వ్యాలీ సహా చాలా ప్రాంతాల్లో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులు ఒక్కరి వేతనంతో జీవించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.