Begin typing your search above and press return to search.

జగన్ కు ప్రయాణం తిప్పలు తప్పినట్లే

By:  Tupaki Desk   |   7 April 2016 11:29 AM IST
జగన్ కు ప్రయాణం తిప్పలు తప్పినట్లే
X
ఏపీ విపక్ష నేతను తరచూ ఇబ్బంది పెట్టే జర్నీ తిప్పలు ఇకపై తప్పనున్నాయి. ఆయన కడపకు వెళ్లాలంటే అదో పెద్ద ప్రయత్నంగా ఉండేది. హైదరాబాద్ నుంచి నేరుగా కడపకు వెళ్లేందుకు అవకాశం లేని నేపథ్యంలో ఆయన సొంతూరుకు వెళ్లి రావటం అదో పెద్ద ప్రయత్నంగా ఉండేది. అయితే.. ప్రయాణం తిప్పలు శుక్రవారంతో చెక్ పడనున్నాయి. హైదరాబాద్ నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు షురూ కానున్న నేపథ్యంలో.. ఏపీ విపక్ష నేతలకిదో వెసులుబాటు కానుంది.

ట్రూ జెట్ సంస్థ శుక్రవారం నుంచి హైదరాబాద్ నుంచి కడపకు విమాన సర్వీసును నడపనుంది. వారంలో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ నుంచి కడప.. మళ్లీ కడప నుంచి తిరుపతి.. తిరుపతి నుంచి హైదరాబాద్ కు సర్వీసు నడపనున్నారు. ఇదే సంస్థ మరికొద్ది రోజుల్లో విజయవాడ నుంచి కడపకు నేరుగా విమానాలు నడిపే ఆలోచనలో ఉంది. అదే జరిగితే.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. జగన్ కు మాత్రం చాలా సౌలభ్యంగా ఉండే వీలుంది.

ప్రస్తుతం తన కార్యకలాపాల్ని వీలైనంత వరకూ హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్న జగన్.. జూన్ తర్వాత నుంచి విజయవాడ నుంచి తన కార్యకలాపాల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా విమాన సర్వీసు ఆయనకు అనుకూలంగా ఉండనుందని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఆయన కడప జిల్లాకు వెళ్లి రావటానికి కొద్దిపాటి ఇబ్బంది ఉండేది. తాజాగా విమాన సర్వీసు అందుబాటులోకి రావటంతో.. ప్రయాణ సమయం ఆయనకు చాలా మేరకు కలిసి రానుందని చెప్పొచ్చు.