Begin typing your search above and press return to search.

50 ఏళ్ల తర్వాత 'ఆనబెల్లె ' దెయ్యం ప్రకంపనలు..అది మళ్ళీ వచ్చేసిందని వణుకుతున్న అమెరికన్లు

By:  Tupaki Desk   |   15 Aug 2020 9:30 AM IST
50 ఏళ్ల  తర్వాత ఆనబెల్లె  దెయ్యం ప్రకంపనలు..అది మళ్ళీ వచ్చేసిందని  వణుకుతున్న అమెరికన్లు
X
'ఆనబెల్లె' ఈ పేరు వింటేనే అమెరికన్లు జడుసుకుంటారు. ఇది మనిషి కాదు ఒక బొమ్మ. అయితే ఈ బొమ్మకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, తనకు నచ్చని వాళ్ళని ఈ బొమ్మ చంపేస్తుందని అమెరికన్ల విశ్వాసం. ఈ బొమ్మ కథతో పలు సినిమాలు వచ్చాయి. పిల్లలు బూచోడు వస్తున్నాడంటే ఎంత భయపడతారో అమెరికాలో ఇప్పటికి కూడా ఆనబెల్లె అనే బొమ్మంటే కూడా అంతే భయం. 1970లో డోనా అనే అమ్మాయికి వాళ్ళమ్మ ఈ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ బొమ్మ చారడేసి కళ్ళు, గుండ్రటి ముఖం కలిగి ఉంది. మెడికల్ స్టూడెంట్ అయిన డోనాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె తన ఫ్రెండ్ ఆంజితో కలిసి ఈ బొమ్మతో ఎక్కువగా గడిపేది. అయితే ఆ బొమ్మకు అతీంద్రియ శక్తులు ఉన్నట్టు వాళ్ళిద్దరూ కొద్దిరోజుల తర్వాత గుర్తించారు.

ఆ బొమ్మ వింతైన శబ్దాలు చేయడం, ఒక చోట పెడితే మరొకచోటికి పోవడం గుర్తించారు. ఆ బొమ్మలో ఓ యువతి ఆత్మ ఉందని, ఇక్కడ అపార్ట్మెంట్ కట్టకముందు ఆ అమ్మాయి ఉండేదని..ఆ తర్వాత చనిపోయిందని ఓ ఫాదర్ వారికి చెబుతాడు. అంతే కాదు ఆ బొమ్మ తమలో ఒకరి శరీరం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న వారిద్దరూ ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలని హెడ్, లారెన్ అనే ఫాదర్లకు అప్పగిస్తారు. వాళ్లను కూడా ఆ బొమ్మ ఎన్నో విధాలుగా భయపెడుతుంది. కొన్నేళ్ళ తర్వాత ఓ విజిటర్ కి హెడ్ ఈ బొమ్మ గురించి చెప్పగా, అతడు దానిపై జోకులు వేస్తాడు. అయితే అతడు అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే కారు ప్రమాదంలో చనిపోయాడు. ఆ బొమ్మ బయటి ప్రపంచంలో ఉండడం ప్రమాదకరమని గుర్తించిన హెడ్ దానిని వుడెన్ బాక్స్ లో బంధించి అమెరికాలోని కనెక్టికట్ వారెన్స్ ఆక్లాట్ మ్యూజియంలో పెట్టాడు.

ఆ బొమ్మ పైన ఇప్పటికీ 'పొరపాటున కూడా ఎవరూ తాక వద్దని 'వార్నింగ్ ఉంటుంది. ఆనబెల్లె కథతో ఎన్నో హారర్ సినిమాలు వచ్చాయి. కాగా తాజాగా ఈ బొమ్మపై ఓ వైరల్ న్యూస్ బయటకు వచ్చింది. ఆక్లాట్ మ్యూజియం నుంచి ఆ బొమ్మ బయటపడిందని, ఇన్నేళ్ళ పాటు తనను బంధించి నందుకు అది ఎవరినీ వదిలిపెట్టదనే వదంతులు వినిపిస్తున్నాయి. ఆ బొమ్మ వచ్చి ఎక్కడ చంపేస్తోందోనని అమెరికన్లు వణికిపోతున్నారు. అయితే ఈ పుకార్లపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇంకా ఈకాలం లో కూడా దెయ్యం ఏంటి అని అంటున్నారు. ఆ దెయ్యం నిజంగా బయటికి వచ్చి ఉంటే కరోనాను చూసి పారిపోతుందని సెటైర్లు వేస్తున్నారు. నిజానికి ఆ బొమ్మ ఇప్పటికీ మ్యూజియంలోనే ఉంది. ఎవరో కావాలనే ఈ బొమ్మ బయటకు వచ్చినట్లు పుకార్లను వైరల్ చేశారు. ఈ దుష్ప్రచారం నమ్మిన జనాలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.